బీజేపీ వైపు డీఎస్ అడుగులు ? టీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి ?  

D Srinivas Steps In Bjp-d Aravindh,d Srinivas,kcr,kcr Daughter Kavitha,telangana,trs,అమిత్ షా

గత కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా లేనట్టుగానే ఉంటూ ఆ పార్టీ అధినేత ఆగ్రహానికి గురయిన తెలంగాణ లో సీనియర్ పొలిటిషన్ గా పేరుపడ్డ ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్ ) పై సస్పెన్షన్ వేటు వేసే ఆలోచనలో టీఆర్ఎస్ అధిష్ఠానం ఉంది. ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు పావులు కడుపుతున్నాడనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఆయన సమావేశం అయ్యారు..

బీజేపీ వైపు డీఎస్ అడుగులు ? టీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి ? -D Srinivas Steps In Bjp

ఇప్పటికే డీఎస్ కుమారుడు అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. ఆయన కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి మరీ లోక్‌సభలో అడుగుపెట్టారు. దీంతో ఆయనకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

డీఎస్ ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్నా ఆయన మీద కోపం కారణంగా కేసీఆర్ ఆయనను పక్కనపెట్టేశారు. డీఎస్ కేసీఆర్ ను కలిసి మాట్లాదామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.

తాజాగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో భేటీ అయ్యారు. పార్టీలోకి తాను వచ్చే విషయమై చర్చించారు.

ఈ నేపథ్యంలో ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయాలని చూస్తోంది టీఆర్ఎస్. అసలు ఆయన మీద ఎప్పుడో సస్పెన్షన్ వేటు వేయాలని చూసారు. నిజామాబాద్ జిల్లా నేతలతోనూ ఈ విషయమై చర్చించారు..

అయినా ఆ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. సస్పెన్షన్ వేటు వేస్తే ఆయన వెళ్లి ఇతర పార్టీలో చేరడానికి ఆమోదం తెలిపినట్లవుతుందన్న కారణంగా ఆయనను వదిలేసారు. దీంతో డీఎస్‌కు ఇతర పార్టీలో చేరే చాన్స్ లేకుండా పోయింది.

టీఆర్ఎస్‌తోనే ఉందామని ఆయన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌కు కూడా వెళ్లారు. చివరికి హైకమాండ్ కూడా డీఎస్ ఎందుకొచ్చారని ఆరా తీయడంతో. మిగిలిన ఎంపీలు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన్ను పూర్తిగా పక్కనపెట్టిసినట్టు అందరికి అర్ధం అయిపొయింది.

అసలు డీఎస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూసారు. సోనియా గాంధీని కూడా కలిశారు.

అయితే ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి వెనక్కి తగ్గిపోయారు. ఏ పార్టీలోనూ చేరకుండా టీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. కానీ ప్రస్తుతం తెలంగాణాలో బీజేపీ బలపడుతుండడం, కాంగ్రెస్ తో పాటు కొంతమంది టీఆర్ఎస్ నాయకులూ బీజేపీ వైపు అడుగులు వేస్తుండడంతో తాను కూడా బీజేపీలో చేరాలని ఆయన ఫిక్స్ అయిపోయారు..

అందుకే అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. ఇక డీఎస్ రాకపై బీజేపీ కూడా హ్యాపీగానే ఉందట. సేవోయిర్ పొలిటీషియన్ కనుక పార్టీ బలోపేతం చేయడంలో ఆయన సహాయ సహకారాలు బీజేపీకి అవసరం అవుతాయనే ఆలోచనలో ఉంది.

అలాగే టీఆర్ఎస్ డీఎస్ ను సస్పెండ్ చేసినా ఆ పార్టీ తరపున దక్కిన రాజ్యసభ సభ్యత్వం పోకుండా బీజేపీ కూడా రక్షణ కల్పించే అవకాశం కూడా లేకపోలేదు.