చంటిబిడ్డ‌తో డ్యూటీ చేసిన డీఎస్పీ.. క‌లెక్ట‌ర్ ఏమ‌న్నారంటే

ఉద్యోగాలు చేయ‌డంలో మహిళ‌లు ఎప్పుడూ ముందు వ‌రుస‌లోనే ఉంటారు.వారు ఎంతో సిన్సియారిటీగా త‌మ విధులు నిర్వ‌హిస్తుంటారు.

 Dsp On Duty With Child What Is A Collector Said, Dsp, Warangal News, Woman Dsp,-TeluguStop.com

ఈ విష‌యాన్ని ఎంతోమంది మ‌హిళ‌లు నిరూపించారు.ఇల్లాలుగా ఎంత ప‌ని ఉన్నా కూడా త‌మ విధులకు మాత్రం ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా చూసుకుంటారు.

అందుకే వారికి ఈ స‌మాజం ఎప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉంటుంది.ఇలాంటి వీర మహిళలు మ‌న చుట్టూ ఎందరో ఉన్నార‌న్న విష‌యం అంద‌రికీ విదిత‌మే.

ఇక ఉద్యోగాల్లో పోలీసు జాబు అనేది ఎంత క‌ఠిన‌మైన‌దో అంద‌రికీ విదిత‌మే.

ఈ పోలీసు జాబులు చేయాలంటే మ‌హిళ‌ల‌కు పెద్ద స‌వాలుగానే ఉంటుంది.

అయినా కూడా మ‌హిళ‌లు మాత్రం ఇసుమంత కూడా బెర‌వ‌కుండా ఈ విధుల‌ను కూడా ఎంతో స‌వాలుగా నిర్వహిస్తూనే ఉంటారు.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వీర మ‌హిళ గురించే చెప్పుకోబోతున్నాం.

మొన్న జ‌రిగిన దసరా ఉత్సవాల్లో ఉమ్మడి వరంగల్ ఎంతో గ్రాండ‌గా జ‌రిగింది.మ‌రి ద‌స‌రా ఉత్స‌వాల‌కు అంద‌రూ ఎంజాయ్ చేస్తారు గానీ పోలీసులుకు మాత్రం డ్యూటీ ఉంటుంది క‌దా.

అందుకే వారు మాత్రం వ‌రంగ‌ల్ మైదానంలో డ్యూటీ చేస్తూనే ఉన్నారు.

Telugu Brave, Dasara Festival, Dsp Duty Baby, Warangal, Dsp-Latest News - Telugu

అయితే ఈ మైదానంలో రావణ సంహార ప్రోగ్రామ్‌లో సెంట్రల్ జోన్ మ‌హిళా డీసీపీ కూడా త‌న డ్యూటీ చేస్తున్నారు.అయితే ఆమె చేతిలో చంటిబిడ్డ‌తోనే ఇలా విధులు నిర్వహిస్తున్నారు.అలా పాపను ఎత్తుకునే చాలా సేప‌టి నుంచి నిల‌బ‌డి డ్యూటీ చేస్తున్నారు ఆమె.దీంతో అక్క‌డ‌కు వ‌చ్చిన క‌లెక్ట‌ర్ ఆమెను గ‌మ‌నించి నేరుగా ఆమె వద్దకు వెళ్లారు.ఆమె చేస్తున్న ప‌నికి ఫిదా అయిపోయ‌న క‌లెక్ట‌ర్ వెంట‌నే మాన‌వ‌త్వంతో స్పందించారు.

ఆమెకు తన పక్క సీటు ఇచ్చి అందులో కూర్చోబెట్టి ఆమెను గౌర‌వించారు.ఈ వార్త ఇప్పుడు వైర‌ల్ గా మారిపోయింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube