చర్మం పొడిగా లేకుండా మృదువుగా ఉండటానికి అద్భుతమైన ఆహారాలు     2018-07-16   12:19:30  IST  Laxmi P

మనం ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తప్పనిసరి. మనం ప్రతి రోజు పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే మన శరీరానికే కాకుండా మన చర్మాన్ని కూడా రక్షిస్తుంది. ఇప్పుడు సుహాప్పీ ఆహారాలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ ఆహారాలను తీసుకోవటం వలన మంచి ఆరోగ్యం మరియు చర్మ సంరక్షణ రెండు విధాలుగా సహాయపడుతుంది.

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన చర్మాన్ని రక్షిస్తాయి. చర్మంను పొడిగా లేకుండా తేమగా ఉంచుతాయి. చర్మం మృదువుగా మారుతుంది. చర్మం పొడిబారే తత్త్వం ఉన్నవారు ఆహారంలో చేపలను భాగంగా చేసుకోవాలి.

Foods To Protect Your Dry Skin-

Foods To Protect Your Dry Skin

అవకాడాల్లో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన వయస్సు రీత్యా వచ్చే ముడతలు,ఫైన్ లైన్స్ వంటి సమస్యలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.

ప్రతి రోజు వాల్ నట్స్ తీసుకోవాలి. వాల్ నట్స్ లో ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు,జింక్ సమృద్ధిగా ఉండుట వలన సోరియాసిస్ సమస్య మరియు చర్మంపై వచ్చే వాపులను తగ్గిస్తుంది.

పొద్దు తిరుగుడు విత్తనాల్లో ఉండే సెలీనియం, జింక్‌లు చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేసి మృదువుగా మరియు ముడతలు లేకుండా చేస్తాయి.

టమాటాల్లో విటమిన్ సి, కెరోటినాయిడ్లు, బీటా కెరోటిన్, లైకోపీన్‌లు సమృద్ధిగా ఉండుట వలన సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి.