పాము తో పరాచికాలు ఆడిన మందుబాబు,చివరికి

అదేదో సినిమా లో ఒక డైలాగ్ ఉంటుంది, పులి తో దూరం నుంచి చూడొచ్చు, దగ్గరకి వెళ్లి ఫోటో దిగాలి అంటే కొంచం రిస్క్ అయినా దిగొచ్చు,కానీ పులిని పట్టుకోవాలని చూస్తే వేటాడేస్తది.ఒక స్టార్ హీరో డైలాగ్ ఇది, ఇప్పుడు ఇంతకీ ఈ డైలాగ్ ఎందుకు అని అనుకుంటున్నారా.

 Drunkman Wrestleswith Snakegets Bittenmultiple Times-TeluguStop.com

క్రూర జంతువు అయిన పులి విషయం లో ఎలాంటి డైలాగ్ వర్తిస్తుందో, హానికరమైన పాము విషయం లో కూడా ఇదే డైలాగ్ వర్తిస్తుంది.ఎందుకంటే దానిని దూరంగా చూడొచ్చు,లేదంటే ఫోటో దిగాలి అన్నా కొంచం రిస్క్ అయినా కనీసం ట్రై చెయ్యొచ్చు, కానీ దానికి పరాచికాలు ఆడామో కాటేయడం మాత్రం ఖాయం.

ఈ విషయం మొత్తం ఎవరికైనా అర్ధం అవుతుంది.

కానీ ఆ ఒక్క వ్యక్తి కి మాత్రం అర్ధంకాలేదు.

అందుకేనేమో దానితో పరాచికాలు ఆడాడు దాని కాటు కు గురయ్యాడు.ఈ ఘటన ఎక్కడ జరిగింది అన్న దానిపై క్లారిటీ లేదు కానీ, ఆ వ్యక్తి మాత్రం మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది.

మద్యం మత్తు తలకెక్కి ఏమి చేస్తున్నామో తనకు ఏమి జరుగుతుందో కూడా గమనించకుండా అతడు ప్రవర్తించాడు.మత్తులో పామును చూసిన అతడు దానిని వదిలిపెట్టకుండా దాని ఎదురుగా కూర్చొని పాటలు పాడి వినిపించాడు.

అంతేకాకుండా దాన్ని కప్పించాడు కూడా, అయినప్పటికీ ఆ పాముకు విషయం అర్ధం అయ్యిందో ఏమో తెలియదు గానీ కామ్ గానే ఉంది.

కానీ అంతటి తో దానిని ఆ మందు బాబు వదలలేదు సరికదా పక్కకు వెళ్ళబోతున్న దాని తోకపై కొట్టాడు.

దీనితో ఆ పాముకు కూడా కోపం నషాళానికి ఎక్కి లేచి బుస్సున కాటేసింది.అయితే మత్తులో ఉన్న ఆ మందు బాబు కు పాము కాటేసిన విషయం కూడా తెలియలేదు.

దానితో దాని తోక పట్టుకొని పక్కకు విసిరికొట్టి ఆ తరువాత దానిని తీసుకొని మెడ లో వేసుకున్నాడు.అప్పటికే ఆ తాచుపాము మూడుసార్లు కాటేసింది.చివరకి విషం ఎక్కడంతో కిందపడిపోయాడు.దీనితో అక్కడే ఉన్న వ్యక్తులు దానిని గమనించి వెంటనే ఆ మందు బాబును హస్పిటల్ కు తీసుకెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube