మందుతాగి జాబ్‌కు వ‌చ్చింద‌ని తీసేసారు.. కానీ అస‌లు ట్విస్టు ఏంటంటే..?

ఉద్యోగులకు కంపెనీలు కంపల్సరీగా కొన్ని రూల్స్ పెడతాయన్న సంగతి అందరికీ విదితమే.అయితే, రూల్స్ ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మధ్య వేరేలా ఉంటాయి.

 Drunker Was Fired For Coming To The Job .. But What Is The Real Twist . Wine, Vi-TeluguStop.com

అన్ని కంపెనీలకు ఒకే రూల్స్ అయితే ఉండబోవు.ఆఫీసుకు ఎన్ని గంటలకు రావాలి, ఏ విధమైన డ్రెస్సింగ్ ఉండాలి, ఇంకా తదితర విషయాలపై సర్టెన్ రూల్స్ ఉంటాయి.

ఒకవేళ ఉద్యోగులు ఆ రూల్స్ ఫాలో కాకపోతే ఆయా సంస్థలు ఉద్యోగులపై కఠినమైన చర్యలు తీసుకునే చాన్సెస్ ఉంటాయి.కాగా, ఏ ఆఫీసులోనైనా మద్యం తాగి వెళ్లడం ఉల్లంఘనే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా, ఓ మహిళా ఉద్యోగిని ఆఫీసుకు మద్యం తాగి వెళ్లిందన్న కారణంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.అయితే, ఈ విషయమై సంస్థను ప్రశ్నిస్తూ ఆమె కోర్టుకు వెళ్లి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరింది.

ఇంతకీ అసలేం జరిగిందంటే స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌లో ఈ ఘటన జరిగింది.షిఫ్ట్‌కి తొమ్మిది గంటల ముందర మద్యం తాగినందుకుగాను మాల్గోర్జాటా క్రోలిక్ అనే మహిళా ఉద్యోగిని ఉద్యోగం నుంచి తీసేశారు.

ఆఫీసుకు వెళ్లిన క్రమంలో మద్యం వాసన రాగా, చెక్ చేసి మద్యం తాగిందని ధ్రువీకరించారు.

అయితే, ఆమె తన 2 గంటల షిఫ్ట్‌కు తొమ్మిది గంటల ముందర అంటే ఆ రోజు ఉదయం 5 గంటల సమయంలో మద్యం తాగిందట.

సదరు కంపెనీ ఆల్కహాల్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీ ఉన్న కంపెనీ కాగా, లిక్కర్ స్మెల్ రావడంతో ఉద్యోగం నుంచి తీసేశారు.అయితే, 11 ఏళ్ల నుంచి ఆ కంపెనీలో పని చేస్తున్న సదరు మహిళ కంపెనీ నిర్ణయాన్ని ప్రశ్నించింది.

Telugu Lac Housand, Uroes, Company, Drunker, Wine-Latest News - Telugu

కంపెనీ మేనేజర్‌కు బ్రీఫింగ్ సమయంలో తాను మద్యం తాగుతానని చెప్పానని పేర్కొంది.తాను షిఫ్ట్‌కు 9 గంటల ముందర మద్యం తాగానని తన వాదనని వినిపించింది.మహిళా చట్టం ప్రకారం కోర్టుకు వెళ్లింది.కోర్టులో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది.సదరు మహిళకు పరిహారంగా 5454 యూరోలు అంటే సుమారు రూ.5 లక్షల 50 వేలు ఇవ్వాలని కోర్టు కంపెనీని ఆదేశించింది.దాంతో ఆ కంపెనీ కోర్టు చెప్పినట్లుగా నష్టపరిహారం ఇచ్చింది.ఈ విషయం తెలుసుకుని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube