ఊదమంటే.. బెదిరిపోయి బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన మందుబాబులు.. ఎక్కడంటే?

మద్యం.ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.

 Drunken Men Theft Breathe Analyzer When Given To Breathe-TeluguStop.com

మహిళా సంఘాలు, హక్కుల కార్యకర్తలు, పలు ఎన్జీవో సంస్థలు మద్యపానం పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేస్తుంటాయి.కానీ, అది సాధ్యమయ్యే పని కాదని పలువురు పేర్కొంటున్నారు.

ఇకపోతే మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు ప్రతీ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటారు.

 Drunken Men Theft Breathe Analyzer When Given To Breathe-ఊదమంటే.. బెదిరిపోయి బ్రీత్ అనలైజర్ ఎత్తుకెళ్లిన మందుబాబులు.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే మందుబాబులు కొందరు రూల్స్ మాట్లాడుతుంటారు.మరి కొందరు అయితే తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.

కాగా, తాజాగా ఇద్దరు మందుబాబులు ఏకంగా బ్రీత్ అనలైజర్‌ను పోలీసుల నుంచి లాక్కొని పరారయ్యారు.వివరాల్లోకెళితే.

తాగిన మైకంలో ఉన్న మందుబాబులు తాజాగా హైదాబాద్ కొండాపూర్‌లో పోలీసులకు తిప్పలు పెట్టారు.వాహనదారులకు శ్వాస పరీక్ష చేసేందుకు నోటి దగ్గర పెట్టిన బ్రీత్‌ అనలైజర్‌ మెషిన్‌ను పోలీసుల చేతుల్లోంచి లాక్కొని ఉడాయించారు మందుబాబులు ఇద్దరు.

కొండాపూర్‌సీఆర్‌ ఫౌండేషన్‌ సమీ‌పంలో ఇటీవల గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు.రాత్రి 11.45 గంటల సమయంలో మియాపూర్‌ వైపు నుంచి బైక్ మీద వస్తోన్న ఇద్దరిని పోలీసులు ఆపారు.

Telugu Breathe Analyzer Machine, Breathe Test, Drinkers, Drunken Men, Drunkers, Hyderabad, Kondapur, Miyapur, Theft Breathe Analyzer, Viral News-Latest News - Telugu

బైకు నడుపుతున్న వ్యక్తికి బ్రీతింగ్ టెస్టు చేసేందుకుగాను బ్రీత్ అనలైజర్‌ను హోంగార్డు తన చేతిలోనుంచి తీసుకెళ్లి ఓ యువకుడి నోటికి దగ్గరలో పెట్టాడు.అంతే.ఇక సదరు యువకుడు హోంగార్డు చేతుల్లోంచి బ్రీత్ అనలైజర్ మెషిన్‌ను లాక్కొని వేగంగా బైక్ మీద పరారయ్యాడు.

బైక్ మీద ఇద్దరు వ్యక్తులుండగా, ఇద్దరూ ఫుల్‌గా మద్యం తాగినట్లు ఉన్నారని పోలీసులు అంటున్నారు.వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు.కానీ, ఫలితం లేకుండా పోయింది.అప్పటికే వారు కనబడకుండా పరారయ్యారు.

ఈ విషయమై కంప్లయింట్ అందుకున్న మాదాపూర్ పోలీసులు సందరు ఆకతాయి మందుబాబులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

#TheftBreathe #Miyapur #BreatheAnalyzer #Drunken #Drunkers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు