మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. గర్భిణిగా ఉన్న కూతురిని దారుణంగా.. ?- Drunken Father Murdered Pregnant Daughter In Karnataka

drunken father murdered pregnant daughter in Karnataka , Karnataka, Anchetti, Karadikal, Father murdered, Pregnant daughter, alcohol intoxication, father shoots daughter, drunken father, arunachalam, venkata lakshmi - Telugu Alcohol Intoxication, Anchetti, Arunachalam, Drunken Father, Father Murdered, Father Shoots Daughter, Karadikal, Karnataka, Pregnant Daughter, Venkata Lakshmi

మద్యం మత్తు మనిషిని రాక్షసుడిగా మారుస్తుంది అనడంలో సందేహం లేదు.ఎందుకంటే దారుణం అయిన ఘోరాలు ఎన్నో మద్యం మత్తులో చేసినవిగా నిర్ధారించబడినవి.

 Drunken Father Murdered Pregnant Daughter In Karnataka-TeluguStop.com

ఇకపోతే కంటికి రెప్పలా కాపాడవలసిన ఓ తండ్రే కన్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండా హతమార్చిన ఘటన బుధవారం కర్ణాటకలో చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.

అంచెట్టి సమీపంలోని కరడికల్‌ గ్రామానికి చెందిన అరుణాచలం కూతురు వెంకటలక్ష్మి (20)కి కోలారు జిల్లా మాలూరు ప్రాంతానికి చెందిన వ్యక్తితో 4 నెలల క్రితం వివాహం జరిగింది.ఈ క్రమంలో గర్భవతి అయిన లక్ష్మి ఉగాది పండుగను పురస్కరించుకుని తన పుట్టింటికి వచ్చింది.

 Drunken Father Murdered Pregnant Daughter In Karnataka-మద్యం మత్తులో తండ్రి ఘాతుకం.. గర్భిణిగా ఉన్న కూతురిని దారుణంగా.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పండగ తర్వాత చిత్తుగా మద్యం తాగిన ఈ యువతి తండ్రి తన భార్యతో గొడవకు దిగి ఆవేశంలో ఆమెను కాల్చబోయాడు.

ఈ సమయంలో అక్కడే ఉన్న కూతురు వెంకటలక్ష్మి తండ్రిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ తుపాకీ పేలి ఆమెకు గాయలవగా ఘటన స్దలంలోనే మృతి చెందింది.

కాగా ఆ తాగుబోతు తండ్రి భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు.ఇక స్దానికులిచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న అరుణాచలం కోసం గాలిస్తున్నారని సమాచారం.

#Karadikal #Father Murdered #Anchetti #Venkata Lakshmi #Drunken Father

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు