ఇద్దరి ప్రాణాలు బలిగొన్న డ్రంకెన్ డ్రైవ్.. !

మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో అందరికి తెలిసిందే.అదీగాక పోలీసులు కూడా ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రచారం చేస్తున్నారు.

 Drunken Drive That Killed Two People-TeluguStop.com

అయినా గాని మందుబాబులు అదేమి పట్టనట్లుగా ప్రవర్తిస్తున్నారు.దీనివల్ల వారి ప్రాణాలు పోవడమే కాదు.అమాయకుల ప్రాణాలు గాల్లో కలసిపోతున్నాయి.ఇంత జరుగుతున్నా గానీ ఏ ఒక్కరిలో కాస్త మార్పుకూడా రావడం లేదు.

ఇకపోతే శంషాబాద్ మండలం పెద్ద తూప్రా వద్ద చోటు చేసుకున్న సంఘటన ఇలాంటిదే.పీకల దాక తాగిన శ్యామ్ అనే యువకుడు నిర్లక్ష్యంగా బైక్‌ నడిపి, నడుచుకుంటు వెళ్తున్న మహిళను ఢీ కొట్టడం తో, ఆ తీవ్ర గాయాలతో మహిళ అక్కడికక్కడే మరణించింది.

 Drunken Drive That Killed Two People-ఇద్దరి ప్రాణాలు బలిగొన్న డ్రంకెన్ డ్రైవ్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా మహిళను ఢీకొట్టిన ఆ యువకుడు అదే స్పీడ్‌లో కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి, కరెంట్ షాక్ తో మృతి చెందాడట.ఇకపోతే బైక్ నడిపిన శ్యామ్, కుల్కచర్ల గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు పోలీసులు.

ఇక ఈ ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.చూశారా డ్రంకెన్ డ్రైవ్ కారణంగా రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసాయి.

#Drunk And Drive #Shamshabad #Death #Accident Case

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు