క్వార్టర్ కోసం చుక్కలు చూపెట్టిన మందుబాబు

మందుబాబులు ఒక్కోసారి చేసే పనులు వారితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పును తెచ్చి పెడతాయి.కాగా తాజాగా హైదరాబాద్‌లో ఓ మందుబాబు చేసిన వీరంగం చూస్తే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం.

 Drunkard Climbs Electric Pole For Quarter Bottle-TeluguStop.com

ఇంతకీ మనోడు ఏం చేశాడో అనే కదా మీ సందేహం.అయితే మేటర్‌లోకి వెళ్లి తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న డీ మార్ట్ షాపింగ్ మాల్ వద్ద ఇలియాస్ అనే మందుబాబు తనకు ఓ క్వార్టర్ బాటిల్ ఇప్పించాలంటూ అక్కడ ఉన్న ఓ కరెంట్ పోల్‌ను ఎక్కాడు.ఏకంగా 30 అడుగుల పోల్ కావడంతో అక్కడున్న వారంతా అతడు ఎక్కడ కిందపడి ప్రాణాలు పొగొట్టుకుంటాడో అని భయపడ్డారు.

తనకు మందు బాటిల్ ఇప్పిస్తేనే కిందకు దిగుతానని చెప్పడంతో వారంతా అతడిని కిందకు రావాల్సిందిగా బతిమాలారు.అయినా మనోడు వినలేదు.దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు సైతం అతడిని కిందకు దిగాలని కోరారు.

ఎవరీ మాట వినకపోవడంతో అతడు కిందపడితే ఎలాంటి ప్రమాదం జరగకుండా అక్కడున్న వారు జాగ్రత్తలు తీసుకోసాగారు.

ఇంతలో కొందరు వ్యక్తులు దగ్గరలోని వైన్స్‌ నుండి ఓ క్వార్టర్ బాటిల్ తీసుకురావడంతో అతడు కిందకు దిగేందుకు ఒప్పుకున్నాడు.అయితే తాను కిందకు దిగాక ఎవరూ ఏమి అనవద్దు అనే కండీషన్ పెట్టి మరీ తన క్వార్టర్ బాటిల్ దక్కించుకున్నాడు.

మొత్తానికి క్వార్టర్ మందు బాటిల్ కోసం అక్కడున్నవారిని ఉక్కిరిబిక్కిరి చేశాడు ఈ ఘనుడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube