పోలీసులను పరిగెత్తించిన తాగుబోతు  

Drunkard Attacks Police In Vizag-crime News,drunkard,police,vizag

మద్యం మత్తులో మనుష్యులు చేసే పనులు కొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి.కానీ కొన్నిసార్లు ప్రాణాలపై తెచ్చే ఘటనలు కూడా మనం చూశాం.

Drunkard Attacks Police In Vizag-crime News,drunkard,police,vizag Telugu Viral News Drunkard Attacks Police In Vizag-crime News Drunkard Police Vizag-Drunkard Attacks Police In Vizag-Crime News Drunkard Police Vizag

తాజాగా విశాఖలో ఓ తాగుబోతు చేసిన పనికి పోలీసులు పరుగులు పెట్టారు.ఇంతకీ ఆ తాగుబోతు చేసిన పని ఏమిటి అనుకుంటున్నారా.? విశాఖలోని ఓ అపార్ట్‌మెంట్ ఎదుట దారికి అడ్డంగా తన వాహనాన్ని నిలిపాడని సెక్యూరిటీ గార్డు గుర్రం సాయి అనే వ్యక్తిని నివారించాడు.

మద్యం మత్తులో కోపంతో ఊగిపోయిన గుర్రం సాయి, సెక్యూరిటీ గార్డుపై దాడికి దిగాడు.

దీంతో అపార్ట్‌మెంట్ వారు 100కు డయల్ చేసి పోలీసులను పిలిచారు.అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డు కుమార్‌లపై గుర్రం సాయి కత్తితో దాడికి పాల్పడ్డాడు.

దీంతో వారు పరుగులు పెట్టారు.తనను అరెస్ట్ చేయడానికి వస్తారా అంటూ ఆ తాగుబోతు చేసిన నానా హంగామా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.

దీంతో అప్రమత్తమైన పోలీసులు, గుర్రం సాయిని అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు.మద్యం మత్తులో నాలుగో సింహాలు పరుగులు పెట్టించిన సదరు నిందుతుడు ప్రస్తుతం కటకటాలపాలయ్యాడు.

ఏదేమైనా స్థానికంగా ఈ ఘటన సంచలనం రేకెత్తించింది.

తాజా వార్తలు