తనని కాటేసిన పాముతో ఆసుపత్రికి ఓ యువకుడు ...! అది చూసిన వైద్యులు ..?

సాధారణంగా పామును చూస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.మనం పాముని ఏం అనకపోతే అది కూడా మనల్ని ఏమీ అనదు.

 Drunk Man Bitten By Cobra Carries Live Snake To Hospital,snake,tamil Nadu,coimba-TeluguStop.com

ఇక అసలు విషయంలోకి వెళితే … ఓ యువకుడు చేసిన పనికి స్థానికులు, వైద్య అధికారులకు అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది.నిజానికి ఆ యువకుడు ఏమి చేశాడన్న విషయానికి వస్తే… తనని కాటేసిన పామును ప్రాణాలతో ఆస్పత్రికి తీసుక వెళ్లడం జరిగింది.

దీనితో ఆ యువకుడిని చూసి వైద్యులు, అక్కడి సిబ్బంది వాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రము లోని కోయంబత్తూర్ లో చోటుచేసుకుంది.

కోయంబత్తూర్ లోని సింగనల్లూరు ప్రాంతానికి చెందిన సౌందర్ రాజన్ ఒక పెయింటర్ జీవిస్తున్నాడు.ఈ యువకుడు గురువారం రాత్రి చౌదరిపాలెంలోని తన మిత్రుడి ఇంటికి వెళ్లడం జరిగింది.

మిత్రుని ఇంటి పక్కన ఇంట్లో పాము ఉన్నట్లు చుట్టుపక్కల స్థానికులు అందరూ కూడా కేకలు వేయడం మొదలుపెట్టారు.

ఇకపోతే ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న సౌందర్ రాజన్ సదరు పాము ఉన్న ఇంట్లోకి వెళ్లి చూసి మూలన ఉన్న నాగుపామును పట్టుకోవడంతో పాము ఒక్కసారిగా అతని చేతిపై కాటు వేయడం జరిగింది.

ఆ తర్వాత ఆ పామును ఒక ప్లాస్టిక్ బ్యాగులో ఉంచి దాన్ని తీసుకోని సౌందర్ రాజన్ నేరుగా హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది.దీనితో అక్కడి వైద్య సిబ్బంది బ్యాగ్ లో నుంచి పాము బయటకు తీసి, మళ్లీ దానిని బ్యాగ్ లో ఉంచి సెక్యూరిటీ గార్డుకు అందజేయడం జరిగింది.

ఇక ఆ సెక్యూరిటీ గార్డ్ ఆ బ్యాగును అటవీశాఖ సిబ్బందికి అందజేయడం జరిగింది.మరోవైపు వైద్య అధికారులు సౌందర్ రాజన్ కు చికిత్స అందజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube