తండ్రి కర్కశత్వం,ఏమి చేశాడో మీరు ఊహించలేరు!

నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి తండ్రులు ఉంటారా అని అనిపిస్తుంది ఈ ఘటన గురించి తెలుసుకుంటే మాత్రం.తల్లి తన ప్రాణం అడ్డంపెట్టి బిడ్దను నవమాసాలు మోసి భూమీదకు తీసుకువస్తే,ఆ బిడ్డను జాగ్రత్తగా కాపాడుకొనే వాడే తండ్రి అని అంటూ ఉంటారు.

 Drunk Man Kills 4 Years Old Son In Nalgonda District-TeluguStop.com

కానీ ఈ నాలుగేళ్ళ చిన్నారి విషయంలో మాత్రం అలా జరగలేదు.అత్యంత కర్కశంగా ప్రవర్తించిన ఆ తండ్రి వల్ల నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.

ఈ ఘటన నల్గొండ జిల్లా లో చోటుచేసుకుంది.స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే….సూర్యా పేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కేంద్రానికి చెందిన చింతల కనకయ్య,స్వప్న దంపతులకు ఇద్దరు సంతానం.

వారిలో కుమార్తె అక్షిత(6),కుమారుడు అక్షయ్(4).అయితే బతుకుతెరువు కోసం ఈ జంట పిల్లల తో సహా కొంతకాలంగా హైదరాబాద్ వచ్చి అక్కడే జీవనం సాగిస్తున్నారు.

అయితే వీరిమధ్య గొడవలు చోటుచేసుకోవడం తో నెలరోజుల క్రితం కనకయ్య కుమారుడు అక్షయ్ ని తీసుకొని నల్గొండ జిల్లా లోని తన పెదనాన్న చింతల రాములు ఇంటికి వచ్చేశాడు.కొద్దిరోజుల తర్వాత బాలుడి బాగోగులు చూడటానికి ఇబ్బందిగా ఉందని, వచ్చి తీసుకెళ్లాలని రాములు కుటుంబం తల్లికి ఫోన్ చేసి చెప్పింది.

ఈ విషయం తెలుసుకున్న కనకయ్య ఆగ్రహానికి గురయ్యాడు.తన కొడుకును భార్య వద్దకు ఎట్టి పరిస్థితుల్లోనూ పంపకూడదని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం అక్కడ బోనాల జాతర కూడా ఉండటంతో ఫుల్లుగా మద్యం తాగి అర్ధరాత్రి ఇంటికొచ్చాడు.

తండ్రి కర్కశత్వం,ఏమి చేశాడో మ

అయితే ఆ సమయంలో నిద్రిస్తున్న కుమారుడిని అత్యంత కర్కశంగా కనకయ్య గొంతు నులిమడంతో పాటు పంటితొ గట్టిగా కూడా కొరికాడు.దీనితో ఆ చిన్నారి బాధతో విలవిల్లాడి ప్రాణాలు వదిలినట్లు తెలుస్తుంది.నిజంగా కనకయ్య చేసిన పనికి ఇంత కర్కశంగా కూడా తండ్రులు ఉంటారా అన్న అనుమానం కలగక మానదు.

కేవలం భార్య వద్దకు బిడ్డను పంపకూడదు అన్న ఉద్దేశ్యం తో కనకయ్య పిల్లాడి విషయంలో ఇంత దారుణానికి వడికట్టినట్లు తెలుస్తుంది.స్థానికుల సమాచారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube