ఆ భారతీయ మహిళకి జైలు శిక్ష...ఎందుకో తెలుసా..??   Drunk Indian-origin Woman Jailed In UK     2018-11-24   16:14:30  IST  Surya

ఓ భారత సంతతి మహిళకి సుమారు ఆరునెలల జైలు శిక్షని విధించింది లండన్ కోర్టు..భారతీయ స్త్రీల సహజసైలికి భిన్నంగా ఆమె విమానంలో ప్రవర్తించిన తీరు అందరికి ఆశ్చర్యాన్ని, కోపాన్ని కలిగించింది..భారతీయ మహిళలు అంటే ఏ దేశానికి వెళ్ళినా సరే అక్కడి ప్రజలు ఎంతో గౌరవాన్ని ఇస్తారు.అంతటి గౌరవంగా మన స్త్రీలు నడుచుకుంటారు..అయితే…

శిక్ష పడిన భారతీయ మహిళ మాత్రం ఫుల్ గా మద్యం సేవించి ఇప్పుడు యూకేలో జైలు ఊచలు లేక్కపెడుతోంది.వివరాలలోకి వెళ్తే..ఓ భారత సంతతి మహిళ యూకేలో జైలుపాలయింది. కిరణ్ జగ్దేవ్ అనే మహిళ స్పెయిన్‌లోని టెనిరిఫె నుంచి యూకే వెళ్తున్న సమయంలో ఆ విమానంలో రచ్చ రచ్చ చేసింది..పరిమితికి మంచి మద్యం సేవించి మరింత కావాలని అంటూ విమాన సిబ్బందిపై నోటికి వచ్చినట్లుగా తిట్టింది…అంతేకాదు సిబ్బందితో ఘర్షణకి కూడా దిగింది..

Drunk Indian-origin Woman Jailed In UK-Drunk Indian Origin Jet2 Airline Kiran Jagdev United Kingdom

అక్కడితో ఆగకుండా ప్రయాణీకులతో గొడవలు పెట్టుకుని తిట్టడంతో పాటు మరో 10 నిమిషాల్లో విమానం కూలిపోతుందంటూ బిగ్గరగా అరవడంతో తోటి ప్రయాణికుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు…దాంతో ఈ ఘటనపై అక్కడి పోలీసులకి అందిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేశారు..అయితే ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆమెకి ఆరునెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పుని ఇచ్చింది..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.