ఎన్నో వ్యాధులను నయం చేసే మునగాకు గురించి తెలిస్తే రోజు తప్పక తింటారు  

Drumstick Leaves Health Benefits -

సాధారణంగా మున‌గ‌కాయ‌ల‌ను అందరు చారు,కూరగా చేసుకొని తింటూ ఉంటారు.మున‌గ‌కాయ‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి అందరికి తెలుసు.

అయితే మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.వాటి గురించి తెలిస్తే ప్రతి రోజు మునగాకును తింటారు.

ఎన్నో వ్యాధులను నయం చేసే మునగాకు గురించి తెలిస్తే రోజు తప్పక తింటారు-Telugu Health-Telugu Tollywood Photo Image

మునగాకును పప్పుగా చేసుకోవచ్చు.అలాగే పొడిగా చేసుకొని తినవచ్చు.

మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి.

మునగాకులో కాల్షియం పాలలో కన్నా 17 రేట్లు అధికంగా ఉంటుంది.మునగాకును ప్రతి రోజు తింటే ఎముకలు,దంతాలు బలంగా,దృడంగా,ఆరోగ్యంగా ఉంటాయి.అందువల్ల పెరిగే పిల్లలకు మునగాకు చాలా మంచిది.

ముంగాకులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి.అందువల్ల నాన్ వెజ్ తినని వారికీ అవసరమైన ప్రోటీన్ ని మునగాకు అందిస్తుంది.దాంతో శరీరానికి పోషణ బాగా అందుతుంది.

మునగాకులో పొటాషియం అరటిపండులో కంటే 15 రేట్లు అధికంగా ఉంటుంది.

దీనితో రక్తసరఫరా మెరుగుపడి రక్తపోటు తగ్గుతుంది.దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

ప్రతి రోజు 7 గ్రాముల మునగాకు పొడిని క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి.మునగాకులో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అందువల్ల మధుమేహం ఉన్నవారికి మునగాకు దివ్య ఔషధం అని చెప్పవచ్చు.

మునగాకులో అమినో ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కంటికి సంబందించిన దృష్టి మాంద్యం, రేచీకటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Drumstick Leaves Health Benefits Related Telugu News,Photos/Pics,Images..

footer-test