డ్రగ్స్ కలకలం,మత్తుకు బానిసలు అవుతున్న యువత  

Drugs Mafia in Bhimavaram, Bhimavaram, Drugs Mafia,Netherland,Bhanu Chander - Telugu Bhanu Chander, Bhimavaram, Drugs Mafia, Drugs Mafia In Bhimavaram, Netherland

మెట్రోపాలిటన్ సిటీలకు మాత్రమే పరిమితమైంది అనుకున్న డ్రగ్స్ దందా ఇప్పుడు జిల్లాలకు కూడా పాకడం కలకలం రేగింది.నిత్యం పాడిపంటలతో విలసిల్లే ఏపీ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో డ్రగ్స్ కలకలం సృష్టించింది.

 Drugs Mafia In Bhimavaram

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఈ డ్రగ్స్ దందా వెలుగు చూసింది.ఇటీవల నెదర్లాండ్ నుంచి ఎన్ డీ ఎం ఏ డ్రగ్స్ భీమవరం వరకు చేరుకున్నాయి.

ఈ డ్రగ్స్ మత్తులో యువత భవిష్యత్ ప్రశ్నర్ధకంగా మారిపోతుంది.ఈ దందా కు సంబంధించి చెన్నై పోలీసులు భీమవరం కి చెందిన భాను చందర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది.

డ్రగ్స్ కలకలం,మత్తుకు బానిసలు అవుతున్న యువత-General-Telugu-Telugu Tollywood Photo Image

దీనితో డొంక అంతా కదిలింది.ఈ దందా కు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

మరో ఐదుగురు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఈ కేసులో మరో కీలక నిందితుడు పూర్ణ చంద్రరావు కోసం పోలీసుల గాలింపు చర్యలు ప్రారంభించారు.

సంపన్నుల పిల్లలే టార్గెట్ గా ఈ దందా నడుస్తున్నట్లు తెలుస్తుంది.కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సక్షన్స్ ద్వారా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది.విద్యా,వ్యాపారాలకు భీమవరం కేంద్రంగా ఉండడం తో యువతకు ఈ డ్రగ్స్ తో వల వేసి ఈ మురికి కూపంలోకి లాగుతున్నారు.సంపన్నుల పిల్లలే ప్రధాన టార్గెట్ గా ఈ దందా ను నడిపిస్తున్నారు.

అయితే పశ్చిమ గోదావరి వంటి ఒక ప్రశాంతమైన జిల్లా లో ఇలాంటి డ్రగ్స్ దందా వెలుగు చూడడం పలువురిని కలవరానికి గురి చేస్తుంది.అయితే ఇలాంటి డ్రగ్స్ అంశం పశ్చిమ గోదావరి జిల్లా లో వెలుగుచూడడం ఇదే తొలిసారి గా తెలుస్తుంది.

అయితే నెదర్లాండ్స్ నుంచి ఈ డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు తెలుస్తుంది.భీమవరం లో భానుచందర్ అనే వ్యక్తి ఈ ఎం డీ ఎం ఏ డ్రగ్స్ ను సప్లయి చేస్తున్నట్లు తెలుస్తుంది.

దీనితో భానుచందర్,కాల్ డేటా, బ్యాంక్ ట్రాన్సక్షన్స్ ఆధారంగా కీలక ఆధారాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అయితే ఈ భానుచందర్ కు గతంలో సినిమా ఇండస్ట్రీ తో కూడా సంబంధాలు ఉన్నట్లు తెలుస్తుంది.

నెదర్లాండ్ నుంచి చెన్నై కి ఈ డ్రగ్స్ సప్లయ్ అవుతుండగా అక్కడ నుంచి భీమవరం కు చెందిన భానుచందర్ యువతకు ఈ డ్రగ్స్ ను అందిస్తున్నట్లు తెలుస్తుంది.దీనికి సంబంధించి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలు ఈ డ్రగ్స్ దందా వెనుక ఎవరు ఉన్నారు అన్న వివరాలు కనుక్కొనే పనిలో పడ్డారు.

#Drugs Mafia #Bhimavaram #Bhanu Chander #Netherland

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Drugs Mafia In Bhimavaram Related Telugu News,Photos/Pics,Images..