ఇన్నాళ్లు డ్రగ్స్.. ఇప్పుడు నిరుపేదల కోసం పని చేస్తానంటూ షారుఖ్ కొడుకు హైడ్రామా?

ఒక తప్పు చేసిన వ్యక్తి కొన్ని కొన్ని సార్లు కొన్ని క్షణాల్లోనే మార్పు చెందుతారు.అలా చాలా వరకు చాలా తక్కువ మందికే జరుగుతుంది.

 Drugs For Years Now Sharukh Khans Son High Drama Working For The Poor,  Shah Ruk-TeluguStop.com

కొందరు మాత్రం ఎన్ని తప్పులు చేసిన వారికి ఎన్ని శిక్షలు విధించినా కూడా వాళ్లలో మార్పులు రావు.ఇదిలా ఉంటే తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు తాను చేసిన తప్పుకు శిక్ష అనుభవించి శిక్ష తోనే తనలోని మార్పులు తెచ్చుకున్నాడు.

ఇంతకు అతడు ఎవరంటే.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్.

గత కొన్ని రోజుల కిందట ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేస్ వ్యవహారంలో అరెస్టయిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు.

ఇక అతడిని అదుపులోకి తీసుకునప్పటి నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కస్టడీ అధికారులు బాగా దర్యాప్తు చేపడుతున్నారు.

ఇక తాజాగా ఆర్యన్ ఖాన్ కు ఆ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

అందులో ఆర్యన్ ఖాన్ ఆ అధికారులతో కొన్ని పనులు చేస్తానని ఓప్పుకున్నాడని తెలిసింది.తాను జైలు నుంచి విడుదలయ్యాక అందరు గర్వపడేలా మంచి పనులు చేస్తానని ఎన్సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖేడే కు హామీ ఇచ్చినట్లు తెలిసింది.

పేదల సంక్షేమం కోసం, ఆర్థిక అభ్యున్నతి కోసం పని చేస్తానని ఒప్పుకున్నాడట.

Telugu Bollywood, Drugs, Hydrama, Mumbai, Poor, Shah Rukh Khan, Sharukhkhan-Movi

అంతేకాకుండా చెడు మార్గాల్లో నడవనని మాట ఇచ్చాడని తెలిసింది.ఈ విషయం తెలియడంతో కొందరు నెటిజన్లు ఇన్ని రోజులు చెడు అలవాట్లతో ఉన్న ఇతడు నిరుపేదల కోసం పనిచేస్తానంటూ హైడ్రామా చేస్తున్నాడని కామెంట్లు పెడుతున్నారు.ఇక ఆర్యన్ ఖాన్ ను కేవలం ఎన్సీబీ అధికారులే కాకుండా కొన్ని స్వచ్ఛంద సంస్థల అధికారులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

ఇక ఆర్యన్ ఖాన్ తో పాటు మరో ఎనిమిది మంది కూడా అరెస్ట్ చేయగా వాళ్లకు కూడా ఈ అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిసింది.గత కొన్ని రోజుల నుండి అతడి బెయిల్ గురించి బాగా హాట్ టాపిక్ గా మారింది.

ముంబై కోర్టు మూడు సార్లు అతడి బెయిల్ ను నిరాకరించింది.ప్రస్తుతం దీనిపై విచారణ కూడా జరుగుతుంది.

Telugu Bollywood, Drugs, Hydrama, Mumbai, Poor, Shah Rukh Khan, Sharukhkhan-Movi

దీంతో బెయిల్ పిటిషన్ గురించి కోర్టు ఈ నెల 20న అసలైన తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.ఇటీవలే తన తల్లిదండ్రులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు అధికారులు.గత కొన్ని రోజుల నుండి బాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేస్ బాగా కలకలం రేపింది.అందులో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పేరు బయటపడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Telugu Bollywood, Drugs, Hydrama, Mumbai, Poor, Shah Rukh Khan, Sharukhkhan-Movi

దాంతో అతడిని ముంబై పోలీసులు అరెస్టు చేయగా షారుఖ్ ఖాన్ పై చాలామంది విమర్శలు చేశారు.కొడుకుని సరిగ్గా పెంచుకోలేని తండ్రి అని బాగా కౌంటర్లు వేశారు.ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడక ముందే ఆర్యన్ కు ముందు నుంచే ఈ అలవాటు ఉందని తన ఫ్రెండ్స్ సహాయంతో డార్క్ వెబ్ నుంచి డ్రగ్స్ ను తీసుకుంటున్నట్లు తెలిసింది.ఇతడిని అధికారులు మరింత దర్యాప్తు చేయగా అందులో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా బయట పడటంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ విషయం బాగా హాట్ టాపిక్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube