డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం…  

One more complaint against bollywood Star Actors about Drugs using , bollywood Star Actors Drugs Case, Bollywood, Rhea Chakraborty, NCB Officials, Karan Johar - Telugu Bollywood, Bollywood Star Actors Drugs Case, Karan Johar, Ncb Officials, One More Complaint Against Bollywood Star Actors About Drugs Using, Rhea Chakraborty

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు తో డ్రగ్స్ కోణంవెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

TeluguStop.com - Drugs Case Viral Video Ncb Officials Karan Johar Party

డ్రగ్స్ కేసులు వెలుగులోకి రావడం తో నార్కోటిక్ అధికారులు దీనికి సంబంధించి విచారణ వేగవంతం చేశారు.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి తో పాటు ఆమె సోదరుడు షోవిక్,అలానే సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిండా,వంటమనిషి దినేష్ సావంత్ సహా పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే రియా విచారణలో 25 మంది పేర్లను బయటపెట్టింది అని దానిలో టాలీవుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వినిపించడం తో ఈ అంశం మరింత సంచలనం సృష్టించింది.అయితే ఇన్ని సంచలనాల మధ్య ఇప్పుడు తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

TeluguStop.com - డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం…-General-Telugu-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ బడా స్టార్ల పేర్లతో కూడిన ఒక ఫిర్యాదు ఎన్సీబీకి శుక్రవారం అందినట్లు తెలుస్తుంది.ఆ ఫిర్యాదులో కరణ్ జోహార్ వీడియో జత చేసి ఉండటం సంచలనం సృష్టిస్తోంది.2019నాటి ఆ వీడియోలో కరణ్ జోహార్‌తో పాటు దీపికా పదుకోణే, విక్కీ కౌశాల్‌, మరికొందరు స్టార్లు ఉన్నారు.వారంతా కూడా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే ఒక అజ్ఞాత వ్యక్తి ఆ వీడియో ను ఎన్సీబీ కి పంపించి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.
అయితే అసలు ఇంతకీ ఆ వీడియో నిజమైనదా లేదంటే డూప్లికేట్ అన్న దానిపై కూడా అధికారులు దానిని ల్యాబ్ కు పంపి పరీక్షలు జరపనున్నట్లు తెలుస్తుంది.

ఏదిఏమైనా సోమవారం నుంచి ఎన్సీబీ జరుపనున్న విచారణలో.మరికొందరు స్టార్లకు నోటీసులు అందే అవకాశం ఉందని మాత్రం అర్ధం అవుతుంది.

అసలు ఈ బాలీవుడ్ డ్రగ్ మాఫియా వెనుక ఎవరెవరు ఉన్నారు, అన్ని వివరాలను సేకరించే పనిలో నార్కోటిక్ అధికారులు.

#NCB Officials #OneMore #BollywoodStar #Karan Johar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Drugs Case Viral Video Ncb Officials Karan Johar Party Related Telugu News,Photos/Pics,Images..