ఆర్యన్ కేసులో బాలీవుడ్ ఇంత నిశ్శబ్దం ఏంటి.. డైరెక్టర్ ఫైర్?

Drug Case Sanjay Gupta Slams Bollywood Silence Aryan Khan Case

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీ క్రూజర్ షిప్ పై దాడి చేసిన అధికారులు అక్కడ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు.

 Drug Case Sanjay Gupta Slams Bollywood Silence Aryan Khan Case-TeluguStop.com

ప్రస్తుతం ఆర్యన్ ముంబై ఆర్థర్‌ రోడ్డు జైలులో ఉన్నాడు.ఈ క్రమంలోని ఆర్యన్ బెయిల్ కోసం షారుక్ ఖాన్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి మాత్రం కోర్టు నుంచి నిరాశే ఎదురవుతోంది.

ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ అరెస్ట్ విషయంపై పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల స్పందిస్తూ ఆయనకు మద్దతుగా నిలబడ్డారు.కేవలం కొందరి రాజకీయ లబ్ధి కోసమే ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి అతనిని ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.

 Drug Case Sanjay Gupta Slams Bollywood Silence Aryan Khan Case-ఆర్యన్ కేసులో బాలీవుడ్ ఇంత నిశ్శబ్దం ఏంటి.. డైరెక్టర్ ఫైర్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉండగా తాజాగా ఆర్యన్ ఖాన్ కి మద్దతుగా నిలబడ్డారు.ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత సంజ‌య్ గుప్తా ట్విట్టర్ ద్వారా తన మద్దతును షారుక్ ఖాన్ కి తెలియజేశారు.

Telugu Aryan Khan, Aryan Khan Arrest, Bollywood Drugs Case, Drugs Case, Producer Sanjay Gupta, Sanjay Gupta, Sanjay Gupta Supports Aryan, Sharukh Khan-Movie

ఈ క్రమంలోనే సంజయ్ గుప్తా మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ ఎంతోమందికి ఎంతో సహాయం చేశారు.ప్రస్తుతం ఆయన ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎందుకు నిశ్శబ్దం వహిస్తోంది.ఇలా ఇండస్ట్రీకి ఎంతో చేసిన షారుఖాన్ విషయంలో ఇలాంటి నిశబ్ద పాటించడం ఎంతో అవమానకరమని సంజయ్ గుప్తా పేర్కొన్నారు.ఇవాళ ఆర్యన్ ఉన్నారు.రేపు మీ పిల్లలో మా పిల్లలో ఉంటే అప్పుడు కూడా ఇలాంటి నిశ్శబ్దాన్ని పాటిస్తారా అంటూ సంజయ్ గుప్తా ట్విట్టర్ ద్వారా షారుక్ ఖాన్ కి మద్దతు తెలియజేశారు.

#Aryan Khan #Sanjay Gupta #Aryan Khan #Sharukh Khan #Drugs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube