అమెరికా మార్కెట్లో రెడ్డీస్ ఔషధం.  

Dr Reddy Pharma In American Market-

అమెరికా మార్కెట్లోకి రెడ్డీస్ ఔషధం దూసుకెళ్తోంది.కొన్ని నెలల కాలంలోనే రెడ్డీస్ దాదాపు 3 రకాల ఔషధాలని అమెరికా మార్కెట్ లోకి విడుదల చేసింది.అమెరికా ఔషధ పరిశీలనా సంస్థ అనుమతుల మేరకు దిగ్విజయంగా తమ ఔషదాలని మార్కెట్ లోకి విడుదల చేసింది.తాజాగా రెడ్డీస్ అమెరికా మార్కెట్ లోకి కఫం, తెమడ లాంటి సమస్యలకి పరిష్కారానికి ఓవర్ ది కౌంటర్ ఔషధం అయినగువాఫెనెసిన్‌, సూడోఫిడ్రైన్‌ హెచ్‌సిఐ లని విడుదల చేసింది...

Dr Reddy Pharma In American Market--Dr Reddy Pharma In American Market-

ఈ ఔషధం గొంతుతో చేరే తెమడ ఇన్ఫెక్షన్ లని పూర్తిగా తొలగిస్తుందని తెలిపింది.స్టోర్ బ్రాండ్ కి సమానమైన ముసినెన్స్‌డీ ని మొదటి సారిగా ఇక్కడ మార్కెట్లో కి తీసుకువచ్చినట్లుగా రెడ్డీస్ హెడ్ కలవాడియా తెలిపారు.ఓటీసీ వ్యాపార విస్తరణకు డాక్టర్‌ రెడ్డీస్‌ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.

Dr Reddy Pharma In American Market--Dr Reddy Pharma In American Market-

అందులో భాగంగానే కొత్త ఉత్పత్తులని మార్కెట్ లోకి తీసుకువస్తున్నట్లుగా తెలిపారు.ఈ రైనీ సీజన్ లో దగ్గు, జలుబు, అలర్జీ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి, ఈ సమస్యలకి సత్వర పరిష్కారానికి ఈ మెడిసిన్ ఎంతగానో ఉపయోగ పడుతుందని తెలిపారు.