ముంచుకొస్తున్న ముప్పు.. అల‌ర్ట్ అయిన కేసీఆర్‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి.అయితే ఇవ‌న్నీ కేసీఆర్‌కు, టీఆర్ ఎస్‌కు పెద్ద స‌వాళ్లుగానే మారుతున్నాయి.

 Drowning Threat Kcr On Alert . Kcr, Revanth, Politics, Bjp , Ys Sharmila , Sharm-TeluguStop.com

ఇప్ప‌టికే ఈట‌ల రాజేంద‌ర్ రూపంలో కేసీఆర్ కు స‌మ‌స్య మొద‌ల‌యితే ఇక ఆయ‌న బీజేపీలో చేరి ఉప ఎన్నిక‌కు రెడీ కావ‌డంతో మ‌రో స‌వాల్ వ‌స్తోంది.ఇదే పెద్ద స‌మ‌స్య అనుకుంటే ఇక ప‌డిపోతున్న కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం వ‌చ్చేసింది.

ఆ పార్టీకి కేసీఆర్‌కు పెద్ద శ‌త్రువైన రేవంత్‌ను ప్రెసిడెంట్‌గా చేయ‌డంతో అస‌లు కేసీఆర్‌కు ఏం చేయాలో పాలుపోవ‌ట్లేదు.

ఇదిలా ఉంటే ఇక ష‌ర్మల‌మ్మ కొత్త పార్టీ మ‌రో టెన్ష‌న్ పెడుతోంది.

వ‌రుస‌గా ఒకేసారి అన్ని స‌మ‌స్య‌లు రావ‌డంతో కేసీఆర్ ఏం చేయాలో అర్థం కావ‌ట్లేదు.మూకుమ్మ‌డి దాడిగా మారి కేసీఆర్‌కు ఆలోచించుకునే స‌మ‌యం కూడా ఇవ్వ‌ట్లేదు.

అయితే వ్యూహాలు ప‌న్న‌డంలో దిట్ట అయిన కేసీఆర్‌ త‌న చాన‌ఖ్య ఆలోచ‌న‌ల‌ను అమ‌లు చేస్తున్నాడు.వెంట‌నే నీళ్ల పంచాయితీని తెర‌మీద‌కు తెచ్చి మ‌ళ్లీ ఆంధ్రా, తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిల్చాడు.

Telugu @cm_kcr, @revanth_anumula, Huzurabad, Krishan, Sharmila, Ts Congrees, Ys

వాటితోనే అన్ని పార్టీల‌కు చెక్ పెట్టాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు.ఇటు ష‌ర్మిల‌మ‌మ్మ దానిపై ఎలాంట కామెంట్స్ చేయ‌లేక మ‌ద‌న‌ప‌డుతున్నారు.అటు కాంగ్రెస్ రేవంత్ కూడా దీనిపై ఏం మాట్లాడాలో అర్థం కాక కేవ‌లం ఫైర్ అవుతున్నారు.ఇక బీజేపీ అయితే దీనిపై పెద్ద‌గా స్పందించ‌కుండా సైలెంట్ అయిపోయింది.

అంటే కేసీఆర్ ఒక్క దెబ్బ‌తో మూడు పార్టీల‌కు చెక్ పెడుతున్నాడ‌న్న‌మాట‌.కాక‌పోతే ఇది ఎంత వ‌ర‌కు ఆయ‌న్ను గ‌ట్టెక్కిస్తుంద‌నేదే పెద్ద ప్ర‌శ్న‌గా మారిపోయింది.

ఒక‌వేళ హుజూరాబాద్‌లో ఓడితే మాత్రం అన్ని పార్టీలూ బ‌ల‌ప‌డుతాయి.కానీ కేసీఆర్ మాత్రం ఇదే సెంటిమెంట్ రేపు హుజూరాబాద్ ఉపఎన్నిక‌ల్లో కూడా పనిచేస్తుంద‌ని ఆలోచిస్తున్నారు.

ఏదేమైనా కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిప‌క్షాలు బేజార‌వుతున్నాయ‌నే చెప్ప‌క త‌ప్ప‌ద‌ని అనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube