షర్మిల పార్టీకి స్పందన కరువు...పీకే రంగంలోకి దిగనున్నాడా?

తెలంగాణలో ఏమాత్రం హడావుడీ లేకుండా ఎంట్రీ ఇచ్చిన షర్మిల జులై 8 న తన వైయస్సార్ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే.అయితే షర్మిల తన పార్టీని ప్రారంభించిన అనంతరం కూడా ప్రజల్లో పెద్దగా స్పందన లేదు.

 Drought Response To Sharmila's Party Will Pk Enter The Field, Sharmila New Part-TeluguStop.com

అయితే పార్టీ ఏర్పాటు తరువాత నిరుద్యోగులకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలని చెప్పి ఇందిరా పార్క్ లో దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే.అయితే షర్మిలకు స్వతహాగా ఆంధ్రా ప్రాంతం గల వ్యక్తిగా పేరు పొందిన వ్యక్తిగా తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

ఎందుకంటే తెలంగాణ ఏర్పడిందే ఆంధ్రా పాలకుల వ్యతిరేకతపై చేసిన ఉద్యమంతో.

Telugu Sharmila-Political

కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ రాజకీయంగా ఆంధ్రా ప్రాంత పాలకులపై ద్వేషం ఉంటుంది.ఎందుకంటే సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వము అని ఖరాఖండీగా  చెప్పడం, తెలంగాణ ఏర్పాటును వంద శాతం అడ్డుకునే ప్రయత్నం చేయడం ఇలాంటి కీలక పరిణామాల నేపథ్యంలో షర్మిల పార్టీని ప్రజలు ఎంత వరకు అదరిస్తారనేది  ఒక ప్రశ్నగా ఉన్న పరిస్థితి.అయితే షర్మిల పార్టీని చక్క దిద్దాడానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రంగంలోకి దిగనున్నాడా అనే ప్రచారం సాగుతోంది.

ఈ విషయంపై మనకు మరింత క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube