ఆదర్శం : సర్పంచ్‌ అయిన ఈ అమ్మయి గ్రామంకు ఆ సమస్య తీరిన తర్వాతే పెళ్లి చేసుకుంటానంటోంది  

Drought Nandurbar Maharashtra Alka Pawar Sarpanch Denied For Wedding-maharashtra Alka Pawar Sarpanch,sarpanch Denied For Wedding,viral In Social Media,vviral,ఆ సమస్య తీరిన తర్వాతే పెళ్లి,ఆదర్శ సర్పంచ్‌

గ్రామాల్లో ఆడవారు సర్పంచ్‌లు అవ్వడం మనం చాలా కామన్‌గా చూస్తూనే ఉంటాం. అయితే ఆడవారు సర్పంచ్‌ అయినా కూడా వారి భర్తలు సర్పంచ్‌లుగా కొనసాగుతూ ఉంటారు. సర్పంచ్‌లుగా కేవలం వారు సంతకాలు చేసేందుకు మాత్రమే పరిమితం అవుతారు..

ఆదర్శం : సర్పంచ్‌ అయిన ఈ అమ్మయి గ్రామంకు ఆ సమస్య తీరిన తర్వాతే పెళ్లి చేసుకుంటానంటోంది-Drought Nandurbar Maharashtra Alka Pawar Sarpanch Denied For Wedding

వారి భర్తలు అన్ని విషయాలను చక్కబెడుతూ ఉంటారు. అయితే మహారాష్ట్రలోని వీర్‌పూర్‌ గ్రామానికి చెందిన ఒక లేడీ సర్పంచ్‌కు ఇంకా పెళ్లి కాలేదు. ఆమె వెనుక నడిపించేందుకు భర్త లేడు.

తల్లిదండ్రులు ఆమెకు మద్దతు ఇవ్వడంతో సర్పంచ్‌గా గెలిచింది.

కేవలం 23 ఏళ్ల అల్కా పవర్‌ వీర్‌ పూర్‌ గ్రామానికి సర్పంచ్‌ అయ్యింది. గ్రామానికి సర్పంచ్‌ అయిన్నప్పటి నుండి కూడా గ్రామంపై తనదైన ముద్ర వేస్తూ పాలన కొనసాగిస్తూ ఉంది. చదువుకున్న అమ్మాయి అవ్వడంతో పాటు, పలు విషయాలపై అవగాహణ ఉండి, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ పై పట్టు ఉండటంతో ఆమె ఎన్నో విధాలుగా గ్రామంలోకి నిధులు తీసుకు రావడం, విరాళాలు సేకరించడం చేసింది.

గ్రామంను చాలా మార్చింది. కాని గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచి నీటి ఎద్దడిని మాత్రం ఆమె తొలగించడంలో విఫలం అయ్యింది. ఇక గ్రామంలో ఉన్న ఒకే ఒక్క సమస్య అయిన మంచి నీటి ఎద్దడిని కూడా తొలగించేందుకు ఆమె సిద్దం అయ్యింది..

అందుకోసం బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో సాగుతున్న వాటర్‌ ఫౌండేషన్‌ లో ఈమె శిక్షణ పొందింది. అందులో నేర్చుకున్నదాని ప్రకారం గ్రామం చుట్టు దాదాపు పది గోతులు తవ్వించింది. గ్రామస్తులు మరియు ఇతరుల సాయంతో ఆమె గుంతలు తవ్వించింది. గుంతల్లో వర్షపు నీరు వచ్చి చేరిన సమయంలో వాటిని శుభ్రం చేసి గ్రామస్తులకు అందించాలని భావించింది.

ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. శాస్వత నీటి సమస్య పరిష్కారం లభ్యం అయ్యే వరకు తాను పెళ్లి చేసుకోను అంటూ తేల్చి చెబుతోంది. ఈ గ్రామస్తులు తాగు నీటి కోసం దాదాపు పది కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. దాంతో సర్పంచ్‌ అల్కా ఈ నిర్ణయం తీసుకుంది.

అల్కా తీసుకున్న నిర్ణయం అందరికి ఆదర్శనీయం.