న్యూయార్క్ వీధులలో హంగామా చేస్తున్న ' డ్రోన్ మ్యాన్ ' ..!

ప్రస్తుత రోజులలో ప్రతి పనిలో కూడా డ్రోన్ కెమెరాలను ఉపయోగిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.డ్రోన్ అనేది గాల్లో ఎగిరే అత్యాధునిక పరికరం.

 Drone Man Flying Crazy On Drone At New York Times Square-TeluguStop.com

ఈ పరికరం ద్వారా మనుషులు వెళ్లలేని గమ్యస్థానానికి వీటిని పంపిస్తూ ఉండడం మనం చూసే ఉంటాం.కానీ డ్రోన్ పై మనిషి వెళ్లడం మీరు ఎప్పుడైనా చూసారా.?? అవును అండి.ఇది నిజం.

డ్రోన్ పై ఒక మనిషి గాలిలో తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా.? న్యూయార్క్ లో జరిగింది.ఒక వ్యక్తి రోడ్డు పై ఎలాంటి భయం లేకుండా డ్రోన్ పై నిలబడి ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్న సన్నివేశలు సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.

 Drone Man Flying Crazy On Drone At New York Times Square-న్యూయార్క్ వీధులలో హంగామా చేస్తున్న డ్రోన్ మ్యాన్ ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.న్యూయార్క్ మహా నగరంలో మార్కెట్లు అన్ని చాలా సందడిగా ఉన్న వేళ డ్రోన్ పై ఒక మనిషి వెళుతూ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా మోర్గాన్ అనే వ్యక్తి పోస్ట్ చేయగా వైరల్ గా చక్కర్లు కొట్టింది.ఆ వీడియో ఆధారంగా డ్రోన్ పై ఒక వ్యక్తి ఎలాంటి భయం లేకుండా హెల్మెట్ ధరించి మరి దూసుకెళ్లడం మనం గమనించవచ్చు.

ఈ డ్రోన్ అత్యధిక పరికరంగా హంటర్ కోవల్డ్ ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.చాలా సురక్షితంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తయారు చేశామని చెప్పుకొచ్చారు.అంతే కాకుండా డ్రోన్ పై వారు ఎలాంటి సమస్యలకు తలెత్తకుండా చాలా సురక్షితంగా భూమి మీదకు ల్యాండ్ అవుతాయని తెలియజేశారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.

#Drone #Flying On Drone #Viral Drone #America #New York

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు