చిన్నారి చేతికి స్కూటి..వైరలైన వీడియో.. ఫలితంగా తండ్రికి శిక్ష

ఎదిగిన పిల్లల చేతికి బండివ్వాలంటే చాలా భయపడతాం.ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఎన్నో జాగ్రత్తలు పడతాం.

 Driving License Of Man In Kerala Cancelled After Four Year Old Daughter Rides A-TeluguStop.com

ఇచ్చాక టెన్షన్ పడుతుంటాం.కాని నాలుగేళ్ల పిల్ల చేతిలో స్కూటి పెట్టి రద్దీగా ఉన్న రోడ్లపై తను బండి నడుపుతుంటే వెనక కూర్చున్న తండ్రి మొదట సంబరపడినా.

చివరికి పోలిసుల చేతిలో చివాట్లు తిన్నాడు.

కేరళలోని పల్లురుతీకి చెందిన సిబు ఫ్రాన్సిస్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి తన టూ వీలర పై అలువాకు బయల్దేరాడు.

మార్గం మధ్యలోకి వెళ్లాక బండి నడుపుతానని కూతురుసరదా పడడంతో.ఆమెని వారించకపోగా ఆమె చేతికి హ్యాండిల్ ఇచ్చేశాడు ఫ్రాన్సిస్.ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు.రద్దీగా ఉండే రోడ్ పై ఆ చిన్నారి అంత వేగంగా బండి నడపడం చూసిన మిగతావారు ఆశ్చర్యపోయారు.

వెనక కూర్చున్న అమ్మానాన్న మాత్రం ఏమాత్రం జంకులేకుండా నిర్భయంగా కూర్చున్నారు.వీరి పక్కగా కారులో వెళ్తున్న మరో ప్రయాణికుడు ఇదంతా గమనించాడు.

ఇంకేముంది వీడియో తీసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.అది వైరల్‌గా మారి చివరికి పోలిసుల వరకూ వెళ్లింది.


వెంటనే సిబు ఫ్రాన్సిప్ పై చర్యలు తీసుకున్నారు మోటర్ వెహికిల్ సిబ్బంది.అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా… రోడ్డుపై ప్రమాదకరంగా ప్రయాణించడం, చిన్న పిల్ల చేత టూవీలర్ నడిపించిన కారణంగా అతడిపై కేసులు నమోదు చేశారు.అంతేకదా పిల్లల చేతికి బండి ఇవ్వడం మొదట సరదాగా ఉంటే తర్వాత అదే అలవాటుగా మారొచ్చు.

ఆ అలవాటు వలన పొరపాట్లు జరగొచ్చు.పెద్ద ప్రమాధాలు జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube