డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్..!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేందుకు వాహనదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు.జూలై 1 నుండి డ్రైవింగ్ లైసెస్న్ జారీకి సంబందించిన నిబంధనలు మారుతున్నాయని తెలుస్తుంది.

 Driving Licence Without Test From Driving Schools, Driving Licence , Driving Lic-TeluguStop.com

డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే లైసెన్స్ ఇచ్చేయనున్నారు కొత్త నిబంధనలకు కేంద్ర రహదారి, రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రల్లో సిమ్యులేటర్, ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉంటే ఈ కేంద్రాల్లో డ్రైవింగ్ పరీక్ష పూర్తి చేసిన అభ్యర్ధులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇక డ్రైవింగ్ టెస్ట్ లేకుండానే వారికి లైసెన్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు.

అక్రిడేటెడ్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల్లో డ్రైవింగ్ నేర్చుకున్న వారికి శిక్షణ అనతరం వెంటనే లైసెన్స్ పొందే అవకాశం ఉంటుంది.

కేంద్రం తాజా మార్గదర్శకాల ప్రకారం ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి వహనాల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు వాటికి ఎకరం స్థలం అవసరమని చెప్పారు.

భారీ ప్యాసింజర్, సరుకు రవాణా వాహనాలు, ట్రెయిలర్స్ నడపడంలో శిక్షణ ఇవ్వాలనుకంటే దానికి రెండెకరాల స్థలం ఉండాలని సూచించారు.రెండు క్లాస్ రూంస్ ఒక కంప్యూటర్, మల్టీమీడియా ప్రొజెక్టర్ ను కూడా ఉపయోగించాలని చెప్పారు.

శిక్షణ కేంద్రానికి బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ తప్పనిసరి అని వెల్లడించారు.అంతేకాదు శిక్షణ తరగుతుల్లో బయో మెట్రిక్ అటెండెన్స్, అర్హులైన శిక్షలు, ఈ పేమెంట్ సౌర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.

శిక్షణ ఇచ్చే వాహనాలకు ఇన్సూరన్స్ తప్పనిసరి.కనీసం 12వ తరగతి విద్యార్హత ఉండి డ్రైవింగ్ లో ఐదేళ్ల అనుభవం ఉన్న వారే శిక్షణ ఇవ్వాలి.

అంతేకాదు మోటార్ మెకానిక్స్ లో ప్రొఫిషియన్సీ టెస్ట్ సర్టిఫికెట్ ఉండాలి.ఒకసారి డ్రైవింగ్ స్కూల్ పర్మిషన్ ఇస్తే ఐదేళ్ల పాటు అక్రిడేష అమల్లో ఉంటుందని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube