ప్రయాణ సమయాల్లో టైట్ జీన్స్ వేశారో, ప్రాణాలకే ముప్పట!

టైట్ జీన్స్ వేసుకుంటే అందరికి చూసేందుకు చాలా బాగుంటుంది.అందుకే ఈ రోజుల్లో అమ్మాయిలు,అబ్బాయిలు ఎవ్వరిని చూసినా టైట్ జీన్స్ లతో దర్శనమిస్తున్నారు.

 Driving Automatic Car Wearing Tight Jeans-TeluguStop.com

అయితే ఈ టైట్ జీన్స్ తో ప్రయాణాలు చేయడం అనేది ప్రమాదకరమని తాజాగా వైద్యులు చెబుతున్నారు.టైట్ జీన్స్ తో ప్రయాణం చేస్తే ప్రాణాలకే ప్రమాదం ఏంటి అని అనుకుంటున్నారా.

టైట్ జీన్స్ వేసి ఏకధాటిగా 8 గంటల పాటు కారు నడిపిన సౌరభ్ శర్మ అనే వ్యక్తి కి సరిగ్గా ఇలాంటి కారణం వల్లే ఇప్పుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు వైద్యులు చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే….

ఢిల్లీ కి చెందిన సౌరభ్ శర్మ(30)తన ఫ్రెండ్స్ తో కలిసి గేరు లేని ఆటోమేటిక్ కారులో రిషికేశ్ బయలుదేరాడు.ఆ సమయంలో అతను టైట్ డెనిమ్ జీన్స్ ధరించాడు.

సుమారు ఎనిమిది గంటల పాటు నిరంతరాయంగా నడిపిన అతనికి ఎడమ కాలు కాస్త తిమ్మిరి ఎక్కినట్లు అనిపించింది.అంతేకాకుండా ఢిల్లీకి తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సౌరభ్ శర్మ తెగ ఇబ్బంది పడ్డాడు.

దీనితో ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని నిర్ధారించారు.

Telugu Car Jeans, Automaticcar, Jeans, Tlugu Ups-

సౌరభ్ ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ రేట్ 10-12 మధ్య ఉందని.అంతేకాకుండా అతడు టైట్ జీన్స్ ధరించి ఏకధాటిగా 8 గంటలు కారు నడపడం వల్ల ఒక కాలుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది అని గుండె పోటు రావడానికి అదికూడా ఒక కారణం అని వైద్యులు చెబుతున్నారు.అందుకే ప్రయాణ సమయాల్లో అందులోనూ దూర ప్రయాణాలకు టైట్ జీన్స్ అనేవి ధరించడం మంచిది కాదన్నది వైద్యుల వాదన.

మరి మీకు గనుక ఈ అలవాటు ఉంటె మాత్రం కొంచం మార్చుకోవాల్సి ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube