నో ఎంట్రీలో బస్సు నడిపి 17 మందిని చంపినందుకు డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు  

Driver Convict To Seven Years-

నిర్లక్ష్యంగా బస్సు నడిపి 17 మందిని నిండు ప్రాణాలను బలితీసుకుని అంతులేని విషాదాన్ని మిగిల్చిన డ్రైవర్‌కు దుబాయ్ న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 50 వేల దిరామ్‌లను జరిమానాగా విధించింది.గత నెల 7వ తేదీని జరిగిన దుబాయ్‌లో జరిగిన ఈ ప్రమాదంపై స్థానిక ట్రాఫిక్ కోర్టులో వాదనలు జరిగాయి.విచారణలో భాగంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బారియర్‌కు సూచిక బోర్డుకు మధ్య కేవలం 12 మీటర్లు మాత్రమే దూరం వుందని డ్రైవర్ తరపు న్యాయవాది వాదించారు.దుబాయ్ ట్రాఫిక్ నియమాల ప్రకారం గంటకు 60 కిలోమీటర్ల వేగం అనుమతించే రోడ్లపై బారియర్ లాంటివి ఏర్పాటు చేసినప్పుడు బారియర్‌కు సూచిక బోర్డుకు మధ్య కనీసం 60 మీటర్ల దూరం ఉండాలని కోర్టుకు తెలిపారు.ఈ కనీస జాగ్రత్త పాటించకపోవడం వల్లే తన క్లయింట్ బస్సును అదుపు చేయలేకపోయాడని ఆయన వాదించారు.

Driver Convict To Seven Years--Driver Convict To Seven Years-

ఇక ట్రాఫిక్ అధికారుల వాదన ప్రకారం ఆ దారిలో స్పీడ్ లిమిట్ 40 కి.మీ మాత్రమేనని కానీ ప్రమాద సమయంలో బస్సు దాదాపు 94 కి.మీ వేగంతో వెళ్తొందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యం, అదుపులేని వేగమేనన్నారు.డ్రైవర్ తరపున మరో న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రమాదం ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని నొక్కి చెప్పారు.

Driver Convict To Seven Years--Driver Convict To Seven Years-

బారియర్ ఉన్న ప్రదేశంలో సూచిక బోర్డును నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని డ్రైవర్‌కు సాయం సంధ్య వేళ నో ఎంట్రీకి సంబంధించిన సూచిక బోర్డు సరిగా కనిపించలేదన్నారు.

ఇందుకు సంబంధించిన నిపుణుల నివేదికను న్యాయవాది కోర్డుకు సమర్పించారు.అయితే వీరి వాదనతో ఏకీభవించని న్యాయస్థానం డ్రైవర్‌ను దోషిగా నిర్ధారించింది.గత నెల 6న ఓ బస్సు డ్రైవర్ దుబాయ్‌లోని మొహ్మద్ బిన్ జయాద్ రోడ్‌‌ మీదుగా బస్సును నడుపుతున్నాడు.వేగంగా వెళుతుండటంతో భారీ వాహనాలు, బస్సులకు ఎంట్రీ లేని దారిలో బస్సు తీసుకెళ్లడంతో రోడ్డుకు పై భాగంలో ఏర్పాటు చేసిన బారియర్‌ను ఆ వాహనం బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో బస్సుకు ఎడమవైపు కూర్చొన్న 17 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.మృతుల్లో 12 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్తానీలు, మరో ముగ్గురు ఇతర దేశాలకు చెందిన వారున్నారు.