తిరుమలలో గుండు కొట్టించుకున్న ఉబర్ డ్రైవర్.. జాబ్ గోవిందా..!

తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లొచ్చాడు హైదరాబాద్ యువకుడు శ్రీకాంత్.తిరుమల నుంచి రాగానే అతని ఉద్యోగం ఊడింది.

 Driver Face Doesn't Recognize Uber App In Hyderabad Hyderabad Driver Issue, Uber-TeluguStop.com

అదేంటి దేవుడు దర్శనానికి వెళ్లొచ్చిన అతనికి అలా ఎలా జరిగింది అనుకోవచ్చు.ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఫిబ్రవరి 27న తిరుపతి నుండి వచ్చాడు.

పనిలో భాగంగా తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వెళ్లి తన సెల్ఫీతో లాగిన్ అవ్వాలని చూశాడు.కాని ఉబర్ లాగ్ ఇన్ ఎంతకీ తనని రికగ్నైజ్ చేయలేదు.

మూడు సార్లు ప్రయత్నించిన శ్రీకాంత్ నాలుగవ సారి సెల్ఫీ లాగ్ ఇన్ కాగా అతన్ని రికగ్నైజ్ చేయని సాఫ్ట్ వేర్ అతని ఐడి బ్లాక్ చేసింది.

శ్రీకాంత్ డ్రైవింగ్ హిస్టరీ పై ఓ లుక్కేస్తే.ఉబర్ లో అతను 1428 ట్రిప్పులు వేయగా అతనికి 4.67 స్టార్ రేటింగ్ ఉంది.తిరుపతిలో వెంకన్నస్వామికి ఇచ్చిన తలనీలాల వల్ల గుండుతో అతను లాగ్ ఇన్ అవుతుంటే సాఫ్ట్ వేర్ తీసుకోలేదు.ఈ విషయంపై ఉబర్ క్యాబ్స్ కు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని తెలుస్తుంది.

తన కారుకి వేరే డ్రైవర్ ను పెట్టుకోమని చెప్పారట.దీనిపై ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ జాతీయ సమాఖ్య ప్రధాన కార్యదర్శి షేక్ సలాయుద్దీన్ శ్రీకాంత్ కు సపోర్ట్ గా ఉన్నారు.

ఇలాంటిది మళ్లీ మరొకరికి జరుగకుండా కూడా అల్గారిధం మార్చేలా చూస్తామని అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube