సుడిగాలిలా చుట్టేసిన దోమలదండు.. వీడియో వైరల్..!

మనం సుడిగాలులను చూస్తూనే ఉంటాం.కానీ ఇది మీరు అనుకుంటున్న సుడిగాలి కాదు.సుడిగాలి తరహాలోనే ఉన్న దోమల గుంపు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీనిని చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవడం ఖాయం.

 Driver Captures Tornado Of Swarming Mosquitoes In East Russia-TeluguStop.com

లక్షలాది దోమలు కలిసి సుడిగాలిలా చుట్టేసి రోడ్డును ఆక్రమించు కున్నాయి.

ఈ ఆశ్చర్య ఘటన రష్యాలో జరిగింది.

 Driver Captures Tornado Of Swarming Mosquitoes In East Russia-సుడిగాలిలా చుట్టేసిన దోమలదండు.. వీడియో వైరల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ దోమలదండును ఒక వ్యక్తి తన కెమెరాలో బంధించాడు.సుడిగాలిలా దూసుకొస్తున్న దానిని చూసి మొదట అతడు సుడిగాలీ అనుకున్నాడ కానీ దగ్గరకు వెళ్లి చూసి అన్ని దోమలు ఒకేసారి చూసి ఆశ్చర్య పోయాడు.

ఈ సంఘటన ఈ నెల్ 17 న జరిగింది.రోడ్డు మీద ప్రయాణిస్తున్న అతడికి ఆ దోమల దండు కనిపించింది.

రష్యాలోని కమ్చత్కా క్రాయ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న అతడికి సుడిగాలి అడ్డుగా రావడంతో అక్కడే ఆగిపోయాడు.కానీ అది సుడిగాలి కాదు.సుడిగాలిలా కనిపించే దోమల దండు.వెంటనే అతడు దానిని వీడియోలో బంధించాడు.వెంటనే అతడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.కొద్దీ గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.నెటిజెన్స్ ఈ వీడియో చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నాడు.

అన్ని దోమలను ఒకేసారి అలా చుసిన నెటిజెన్స్ అన్ని కలిపి ఒకేసారి కుడితే అంతే సంగతులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు వాటి దగ్గరకు వెళ్లక పోవడమే మంచిదని మరి కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.అలాగే ఇలా అన్ని లక్షల దోమలు కలిసి గుంపులుగా విహరించడం ప్లేగు వ్యాధికి సంకేతమని అంటున్నారు.

అంత ఆశ్చర్యం కలిగించే వీడియోను మీరు కూడా చూసేయండి.

#TornadoOf #DriverCaptures #TornadoOf

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు