దృశ్యం సీక్వెల్ ఎప్పుడో తెలుసా..?  

Drishyam 2 To Hit Floors Soon, Drishyam, Sequel, Jeethu Joseph, Venkatesh - Telugu Drishyam, Jeethu Joseph, Sequel, Venkatesh

మలయాళంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘దృశ్యం’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు జీతూ జోసెఫ్ తనదైన మార్క్‌తో తెరకెక్కించడంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా పూర్తిగా సక్సెస్ అయ్యింది.

 Drishyam Sequel Jeethu Joseph

ఇక ఈ సినిమాను కథలో ఎలాంటి మార్పు లేకుండా ఇతర భాషల్లో రీమేక్ చేయగా, అన్ని చోట్లా ఇది సూపర్ సక్సెస్ అయ్యింది.

తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఇప్పటికీ టీవీలో ప్రసారమైతే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు.

దృశ్యం సీక్వెల్ ఎప్పుడో తెలుసా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతలా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.కాగా ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఇప్పటికే దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేశాడట.కాగా మోహన్ లాల్ 60వ పుట్టినరోజున ఈ సీక్వెల్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశాడు ఈ డైరెక్టర్.

ఇక మొదటి భాగం ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుండే ఈ సీక్వెల్ కథ మొదలువుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.

అయితే ఈ సినిమాను తెలుగులో ఎప్పుడు తెరకెక్కిస్తారు, తెలుగులో ఎవరు హీరోగా నటిస్తారు అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

మరి దృశ్యం సాధించిన సక్సెస్‌ను ఈ సీక్వెల్ చిత్రం ఎలా కంటిన్యూ చేస్తుందో చూడాలి.ఇక తెలుగులో విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాను శ్రీప్రియ డైరెక్ట్ చేయగా ఈ సినిమాలో వెంకటేష్ సరసన మీనా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.

#Drishyam #Jeethu Joseph #Sequel #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Drishyam Sequel Jeethu Joseph Related Telugu News,Photos/Pics,Images..