ఈ వెంకటేష్ కూతురు ఇప్పుడెలా ఉందో చూస్తే అవాక్కవుతారు....!

నల్లవం అనే మలయాళం సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైనది ఈ మలయాళం కుట్టి ఎస్తర్ అనిల్.తెలుగులో ప్రముఖ దర్శకురాలు శ్రీప్రియ దర్శకత్వం వహించిన “దృశ్యం” అనే చిత్రంలో హీరో దగ్గుబాటి వెంకటేష్ మరియు మీనా ల కూతురు పాత్రలో నటించి ప్రేక్షకుల్ని బాగానే అలరించిన చైల్డ్ ఆర్టిస్ట్ “ఎస్తర్ అనిల్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.అయితే ఈ చిత్రంలో తన నటనతో అభినయం తో సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది “ఎస్తర్ అనిల్” .అయితే ఈ చిత్రంలో నటించిన అనంతరం ఎస్తర్ అనిల్ మలయాళం, తమిళం, తదితర భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించినప్పటికీ ఈ అమ్మడుకి పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.

 Drishyam Movie Fame Esther Anil Movie Offers News,  Esther Anil,  Drishyam Movie-TeluguStop.com

దీంతో కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన చదువు పై దృష్టి సారించింది.

ఆ తర్వాత ఇటీవలే మలయాళంలో జాక్ అండ్ జిల్ అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో కనిపించింది.అలాగే తెలుగులో ప్రముఖ దర్శకుడు తేజ మామి దర్శకత్వం వహించినటువంటి జోహార్ అనే చిత్రంలో కూడా నటించింది.

అయితే ఇప్పటివరకు ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఈ అమ్మడు పాత్రకు కొంతమేర ప్రాధాన్యత లేకపోవడంతో గుర్తింపుకు నోచుకోక లేకపోయింది.

దీంతో తాజాగా ఎస్తర్ అనిల్ నటన పరంగా మరిన్ని మెలకువలు నేర్చుకుంటూ హీరోయిన్ అవకాశాలను దక్కించుకోవడం కోసం తీవ్రంగా శ్రమిస్తుంది.

ఇందులో భాగంగా పలు రకాల ఫోటో సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేస్తోంది.తాజా సమాచారం ప్రకారం మలయాళంలోని ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube