ఈ రెండు పానీయాలు తాగితే వృద్ధాప్య సమస్యలు రావు..!

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి జీవిలో కూడా వృద్ధాప్య ఛాయలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి.దీనికి మానవులు అతీతమేమీ కాదు.

 Drinks, Latest News, Updates, Health Care, Health Tips, Healthy Foods-TeluguStop.com

మానవ శరీరంలోని ప్రతి అవయవం కూడా కాలక్రమేణా తన సామర్ధ్యాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతుంది.ఇలాంటి సందర్భాల్లో అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం.

అయితే కొందరు యుక్త వయసులోనే ముసలి వారి లాగా కనిపిస్తుంటారు.అలాంటి వారు రెండు పానీయాలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వృద్ధాప్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

ఆ రెండు పానీయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మనం తీసుకుంటున్న ఆహారం, పాటిస్తున్న అలవాట్లు, అవలంబిస్తున్న జీవనశైలిపై ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

ఎటూ కదలకుండా, సరైన పౌష్టికాహారం తీసుకోకుండా రోజులు గడిపితే త్వరగా వృద్ధాప్య ఛాయలు చుట్టుముట్టే అవకాశం ఉంది.ఫలితంగా వయసు సంబంధిత వ్యాధుల బారినపడే ముప్పు ఎక్కువ.

అయితే కాఫీ, కొకొవా అనే రెండు పానీయాలు తాగడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసి వయో సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టొచ్చని అంటున్నారు పరిశోధకులు. న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్ తాజా అధ్యయనంలో భాగమైన కొందరు నిపుణులు కాఫీ, కొకొవా పానీయాలు వృద్ధాప్య సమస్యలు దరిచేరకుండా చేయగలవని వివరించారు.

అయితే ఈ అధ్యయనం 12 సంవత్సరాల పాటు 842 మంది ప్రజలపై కొనసాగింది.ఈ సమయంలో న్యూరో సైకాలజీ పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు కాఫీ, కొకొవాలోని ఔషధ గుణాలను కనుగొన్నారు.

Telugu Drinks, Care, Tips, Healthy Foods, Latest, Ups-Latest News - Telugu

ఈ రెండు పానీయాలు ప్రతిరోజు పుచ్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని తేల్చారు.వయసు పైబడుతున్న కొద్దీ చాలామంది మతిమరుపుతో బాధపడుతుంటారు.అలాంటి వారు కాఫీ, కొకొవా పానీయాలను తాగడం ద్వారా అల్జీమర్స్‌ వంటి మతిమరుపు రోగాలను నివారించొచ్చు.పాలీఫెనాల్స్ అనే వృక్ష రసాయనాలు మెదడులోని న్యూరోటాక్సిన్‌ వల్ల అయ్యే గాయాలను నయం చేసి న్యూరాన్‌లను రక్షిస్తాయి.

​​న్యూరోఇన్‌ఫ్లమేషన్‌ను అణిచివేసి జ్ఞాపకశక్తిని పెంచుతాయి.అయితే పాలీఫెనాల్స్ అనేది కాఫీ, కొకొవాలో అధిక స్థాయిలో లభిస్తున్నట్లు పరిశోధకులు కనిపెట్టారు.

అందువల్ల కాఫీ, కొకొవా పానీయాలు తాగితే మెదడు పనితీరు చురుకుగా మారుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.గుండె, కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే చక్కటి ఔషధంలాగా కూడా కాఫీ, కొకొవా పనిచేస్తాయని పరిశోధకులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube