ప్రస్తుత సమ్మర్ సీజన్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తూ ఉంటాయి.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ నూరూరించే మామిడి పండ్లు రుచితో పాటు పోషకాలు కూడా మెండుగా నిండి ఉంటాయి.
విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, బెటా కెరోటిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడన్ని పోషకాలు మామిడి పండ్లు కలిగి ఉంటాయి.అందుకే మామిడి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అయితే మామిడి పండ్ల విషయంలో కొందరు తెలిసో.తెలియకో.
చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు.

ఆ తప్పులే ఎన్నో తిప్పలు తెచ్చిపెడతాయి.ముఖ్యంగా మామిడి పండ్లు తిన్న తర్వాత చాలా మంది నీరు తాగుతుంటారు.కానీ, ఎప్పుడు కూడా ఇలా చేయరాదు.
మామిడి పండ్లు తిన్న వెంటనే నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి.అలాగే పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే వెంటనే కాకుండా ఒక గంట ఆగిన తర్వాత నీరు సేవించాలి.

అలాగే కొందరు మామిడి పండ్లలో పెరుగు కనిపి తీసుకుంటారు.కానీ, ఇలా చేయడం కూడా ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు.మామిడి పండ్లు, పెరుగు కలిపి తినడం లేదా వెంట వెంటనే తినడం వల్ల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ తయారవుతుంది.
దాంతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇక మామిడి పండ్లు తిన్న వెంటనే కారం కారంగా ఉండే ఆహారాలు, మసాలా వంటలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరాదు.
మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తీసుకుంటే కడుపు అల్సర్, చర్మ సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది.అదేవిధింగా, మామిడి పండ్లు తిన్న వెంటనే కూల్డ్రింక్స్, సోడాలు వంటివి తీసుకుంటే.
బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి.దాంతో మధుమేహం బారిన పడే అవకాశాలు ఎక్కువ.
కాబట్టి, మామిడి పండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి.