భోజన సమయంలో నీరు త్రాగటం మంచిదేనా  

సాధారణంగా మనం భోజనం చేసే సమయంలో ఒక గ్లాస్ మంచి నీళ్లను పెట్టుకుంటూ ఉంటాం. అలాగే హోటల్ కి వెళ్లి ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా ముందుగా మంచినీళ్లను మన ముందు పెడతారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం ఘన పదార్ధాలు తీసుకునేటప్పుడు మరియు ఘన పదార్ధాలు తిన్నా తర్వాత మంచి నీళ్లు త్రాగటం మంచిది కాదని అంటున్నారు. ఈ విధంగా నీటిని త్రాగటం వలన అది జీర్ణ వ్యవస్ధకు హాని కలిగించటమే కాకుండా జీర్ణ శక్తిని కోల్పోయేలా చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు.

Drinking Water At The Right Time-

Drinking Water At The Right Time

మరి మంచి నీళ్లను ఎప్పుడు త్రాగాలి. భోజనం చేయటానికి అరగంట ముందు నీటిని త్రాగితే ఆ నీరు జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. భోజనం అయినా తర్వాత రెండు గంటలకు మంచి నీటిని త్రాగాలి. భోజనం తర్వాత త్రాగే నీరు పొట్టలో జీర్ణమైన ఆహారాన్ని, రసాలను తొలగించి శుభ్రం చేయటానికి సహాయాపడుతుంది. ఈ రకంగా తాగే నీరు జీర్ణ క్రియకు ఏ మాత్రం అడ్డంకి కాదని పోషకాహార నిపుణులు చెపుతున్నారు.

Drinking Water At The Right Time-

నీరు అవసరం లేనప్పుడు త్రాగితే అది గ్యాస్ సమస్యలకు దారి తీస్తుంది. రోజు మొత్తం మీద ఎన్ని లీటర్ల నీటిని త్రాగాలో తెలుసుకుందాం. ఉదయం లేవగానే ఒక లీటర్ నీటిని త్రాగాలి. మధ్యాహ్నం లంచ్ వరకు ఒక లీటర్ నీటిని త్రాగాలి. భోజనం చేసిన రెండు గంటల తర్వాత నుండి ఒక లీటర్ నీటిని త్రాగాలి. రాత్రి డిన్నర్ లోపు మరో లీటర్ నీటిని త్రాగాలి. ఈ విధంగా ప్రతి రోజు శరీరానికి నాలుగు లీటర్ల నీటిని అందించాలి.