టీ పై చైనా శాస్త్రవేత్తల పరిశోదన... టీ తాగే ప్రతి ఒక్కరు ఇది తప్పకుండా చదవాలి, లేదంటే చాలా మిస్‌ అవుతారు  

Drinking Tea Regularly May Lower Fracture Risk-

ఇంగ్లీష్‌ వారు ఇండియాలో వదిలి వెళ్లింది ఏంటీ అంటే అందరు ఠక్కున చెప్పే వాటిలో టీ మరియు కాఫీ ముందు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.చిన్నా, పెద్దా, ముసలి, ముతక ఇలా అన్ని వర్గాల వారు, అన్ని వయసుల వారు కూడా టీ కి బానిస అయ్యారు.

Drinking Tea Regularly May Lower Fracture Risk- Telugu Viral News Drinking Tea Regularly May Lower Fracture Risk--Drinking Tea Regularly May Lower Fracture Risk-

ఇండియాలో ఉండే పాలను పాలలా కాకుండా వాటిని ఆగం ఆగం చేసి దాన్ని టీ అంటూ తాగమని ఇంగ్లీష్‌ వాడు చెప్పి ప్రజల ఆరోగ్యంను దెబ్బ తీశాడు అంటూ కొందరు టీ వ్యతిరేకులు అంటారు.కప్‌ పాలు తాగడం చాలా ఆరోగ్యం, అదే కప్‌ టీ తాగితే ఏం లాభం అంటూ వారు ప్రశ్నిస్తారు.

Drinking Tea Regularly May Lower Fracture Risk- Telugu Viral News Drinking Tea Regularly May Lower Fracture Risk--Drinking Tea Regularly May Lower Fracture Risk-

టీ వల్ల లాభం ఏంటీ అనే వారికి ఇది చూపించండి.

టీ పై ఇప్పటికే ఎన్నో దేశాల్లో ఎన్నో ప్రయోగాలు జరిగాయి.దాదాపు 95 శాతం ప్రయోగాల్లో టీ ఆరోగ్యానికి మంచిదే అని వెళ్లడయ్యింది.అయితే అతిగా టీ తాగడం మంచిది కాదని మాత్రం అందరు అంటున్నారు.రోజులో రెండు లేదా మూడు కప్పుల టీ ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతకు మించి టీ తాగడం వల్ల అంతే అనారోగ్య సమస్యలు వస్తాయన్నది కూడా అంతే నిజం.తాజాగా చైనాలోని పెకింగ్‌ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయమై ప్రయోగాలు చేశారు.

ఈ ప్రయోగంలో 30 ఏళ్లుగా టీ తాగుతున్న అయిదు లక్షల మందిని ఆన్‌ లైన్‌ ద్వారా ప్రశ్నించడం జరిగింది.అయిదు లక్షల మందిలో 80 శాతం మంది టీ తాగిన వారికి కీళ్ల నొప్పులు మరియు ఎముకలకు సబంధించిన సమస్యలు ఏమీ లేవు.అదే టీ తాగని వారికి కీళ్ల నొప్పులు మరియు ఎముకలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లుగా వెళ్లడయ్యింది.ఈ సర్వేలో పలు అనారోగ్య సమస్యల గురించి విశ్లేషించిన సమయంలో ఎక్కువ శాతం టీ తాగని వారికే అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా వెళ్లడయ్యింది.

టీ అనేది రిఫ్రెష్‌కు మాత్రమే కాకుండా అద్బుతమైన ఔషదంగా కూడా పని చేస్తుంన్నమాట.అయితే ఎక్కువగా మాత్రం టీ తాగొద్దు అనేది అందరి మాట.