భారతీయుల్లో దాదాపు మెజారిటీ ప్రజలు టీ తాగకుండా ఉండలేరనే చెప్పొచ్చు.అంతలా ఛాయ్‌కి అడిక్ట్ అయిపోయారు జనాలు.
తమ పనులను పక్కనబెట్టి టీ తాగితే కొత్త ఎనర్జీ వస్తుందని భావించేవారు బోలెడు మంది ఉన్నారు.అయితే, ప్రతీ సారి టీని గాజు గ్లాసుల్లో తాగితే వాటిని మళ్లీ కడుక్కోవాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే ప్లాస్టిక్ కప్స్‌ను ప్రతీ ఒక్కరు వాడుతున్నారు.అతిథులకైనా, ఇంట్లో వాళ్లకైనా ఎవరికైనా ప్లాస్టిక్ కప్స్‌లోనే టీ ఇస్తున్నారు.
ఇక సాధారణ టీ షాప్స్‌లో ఎక్కడైనా ప్లాస్టిక్ కప్స్ యూసేజ్ కామన్ అయింది.కాగా, దేశవ్యాప్తంగా ప్లాస్టిక్‌పై నిషేధం విధించారు.
అయినా వాటి యూసేజ్ ఇంకా ఉంది.టీ స్టాల్స్, జ్యూస్ సెంటర్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బేకరీస్, స్మాల్ షాప్స్ అంతటా ఇవే కనిపిస్తున్నాయి.
కాగా ఈ ప్లాస్టిక్ కప్స్ యూసేజ్ వల్ల పర్యావరణానికి హాని జరగడంతో పాటు మనుషుల ఆరోగ్యం కూడా పాడైపోతున్నది.

ప్లాస్టిక్ కప్స్‌లో టీ, ఇతర వేడి ద్రావణాలు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఖరగ్‌పూర్ ఐఐటీ పరిశోధకులు తేల్చారు.ఇందుకు వారు శాస్త్రీయ అధ్యయనం కూడాచేశారు.డిస్పోజబుల్ పేపర్ కప్స్‌లో మూడు సార్లు 100 మి.లీ.చొప్పున వేడి టీ తాగడం వల్ల 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు హ్యూమన్ బాడీలోకి వెళ్తాయని రీసెర్చర్స్ పేర్కొన్నారు.80-90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మి.లీ.ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు మనలోకి చేరతాయని చెప్పారు.క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు శరీరంలోకి వెళ్లడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే చాన్సెస్ ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ కప్స్‌కు బదులుగా స్టీల్ లేదా గాజు గ్లాసు లేదా పింగాణీ గ్లాసుల్లో ఛాయ్ తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.