డయాబెటిస్ లేదా మధుమేహం.ఇటీవల కాలంలో టీనేజ్‌లోనే చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గడం వల్ల మధుమేహం బారిన పడతారు.మధుమేహం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి.
ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, హార్మోన్ల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల డయాబెటిస్ వస్తుంది.అలాగే ఒక్కోసారి వారసత్వంగా కూడా ఈ వ్యాధి బారిన పడతారు.
అయితే మధుమేహం వచ్చినంత మాత్రాన కంగారు పడాల్సిన అవసరం లేదు.
సరైన జాగ్రత్తలు పాటిస్తూ.
రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకుని ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చు.అయితే మధుమేహం వ్యాధి గ్రస్తులు పాలు తాగొచ్చా? లేదా? ఒకవేళ పాలు తాగితే ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి? అన్న ప్రశ్నలు చాలా మంది మదిలో ఉన్నాయి.వాస్తవానికి మధుమేహం ఉన్న వారు సరైన ఆహారం తీసుకుంటే.ఈ వ్యాధిని సులువుగా జయించవచ్చు.అయితే ఆ సరైన ఆహారంలో పాలు కూడా ఓ భాగం.అవును, మధుమేహం వ్యాధి గ్రస్తులు నిశ్చింతగా పాలు తీసుకోవచ్చు.
కానీ, ఎప్పుడో అప్పుడు కాకుండా.ఉదయం పూట తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.మధుమేహం ఉన్న వారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఓ గ్లాస్ పాలు కూడా తీసుకోవాలట.అలా చేయడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయని.
ఫలితంగా మధుమేహం బారి నుంచి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి, ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఖచ్చితంగా ఒక గ్లాసు పాలను తీసుకోండి.
కానీ, పాలలో షుగర్‌ను మాత్రం యూజ్ చేయకూడదని చెబుతున్నారు.షుగర్‌కు బదులుగా తేనె లేదా బెల్లంను తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఇక పాలు తాగడం వల్ల మధుమేహం తగ్గడమే కాదు.ఎముకలను దృఢంగా మార్చడంలోనూ, బరువు తగ్గించడంలోనూ, గుండె జబ్బులను దూరం చేయడంలోనూ, శరీర రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రయోజనాలే ఉన్నాయి.కాబట్టి, మధుమేహం రోగులే కాకుండా.
అందరూ బ్రేక్ ఫాస్ట్ తర్వాత పాలను తీసుకోవడం మంచిది.