ఒక్క అలవాటు వలన ఏడు రకాల క్యాన్సర్‌లు

మద్యం మత్తు ఒక్కసారి పట్టుకుందంటే వదలడం కష్టమే.దాన్ని ముట్టుకున్నాక బానిస అవాల్సిందే.

 Alcohol Addicts At Risk Of 7 Cancers-TeluguStop.com

అంతటి సమ్మోహనశక్తి మద్యానికి ఉంది.అందుకే మద్యం కోసం బంధాల్ని చెడగొట్టుకుంటున్నాడు, ఆస్తులని పోగొట్టుకుంటున్నాడు, సమయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకుంటున్నాడు మనిషి.

ఈ మహమ్మారి ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని కొత్తగా చెప్పనక్కరలేదు.ఇక కొత్తగా తెలిసిన విషయం ఏమిటంటే, మద్యం అలవాటు వలన ఒకటి కాదు, రెండు కాదు, ఏడురకాల క్యాన్సర్‌లు వస్తాయట.

“మద్యం వలన క్యాన్సర్‌ వస్తుందని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు ఉన్నాయి.ఒక చోట కాదు, ఏడు చోట్ల ఇది క్యాన్సర్ కి కారణం కావొచ్చు.

లివర్ క్యాన్సర్ , కెనాల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, లారింక్స్ క్యాన్సర్‌, ఓసోఫగస్ క్యాన్సర్, ఒరొఫరిక్స్ క్యాన్సర్‌ .ఇలా ఇన్ని రకాల క్యాన్సర్‌లకు కారణమవుతుంది మద్యం అలవాటు.అయినా మద్యం వలన ఆరోగ్యానికి ప్రమాదమని కొత్తగా మేము చెప్పేది ఏమి లేదు.శరీరంపై, దాని పనితనంపై అవగాహన లేనివారికి కూడా దీనివలన కలిగే నష్టాలు తెలుసు” అ ని ఓటాగో యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జెన్ని కొన్నోర్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ మూలన మరణిస్తున్నవారిలో 5.8% మంది పూర్తిగా మద్యం వల్లే క్యాన్సర్‌ కొనితెచ్చుకుంటున్నారని మరో అధ్యయనంలో వెల్లడైంది.కాబట్టి, మందుబాబుల్లారా … కాస్త జాగ్రత్తగా ఉండండి, మీ గురించి కాకపోయినా, మీ కుటుంబం గురించైనా ఆలోచించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube