భూమి మీద నివసించే ప్రతి వ్యక్తి కలలు కనటం సహజమే.కొన్ని కలలు మంచిగా ఉంటే….
మరి కొన్ని కలలు చెడుగా ఉంటాయి.అయితే ఆ కలలో జంతువులు కనిపిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
జింక
ఉన్నత లక్ష్యాలని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్ధం.
పిల్లి
కలలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలా మంది నమ్ముతారు.
అయితే, పిల్లుల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం అది సృజనాత్మకతకు, శక్తికి చిహ్నమని భావిస్తారు.
ఆవు
మీ కలలో ఒక ఆవు కనిపిస్తే మీ విధేయతను, నిష్క్రియా స్వభావాన్ని సూచిస్తుంది.
ఎద్దు:
మీకలలో ఎద్దును చూస్తే, విస్తారమైన సంపద రాబోతోందని అర్ధం.
దూడ
కలలో దూడ కనిపిస్తే అనుభవ లేమికి సూచన.
ఒంటె
మీ భుజాలలో సమస్యలు ఉన్నాయని అర్ధం.
గాడిద
అవగాహనా లోపం ఉన్నట్టు సూచన.
గబ్బిలం
మంచి శకునం కాదు.ఎటువంటి అభివృద్ధి ఉండదు.
ముసలి
ఊహించని ప్రమాదం సంభవిస్తుందని అర్ధం.