ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరేక్కిన కేజీఎఫ్ కి సీక్వెల్ గా చాప్టర్ 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే.మొదటి సినిమా కంటే భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాని ప్రశాంత్ నీల్ తెరపై ఆవిష్కరించాడు.
ఇక ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రస్తుతం చాలా స్పీడ్ గా జరుగుతుంది.పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ సొంతం చేసుకోవడానికి అన్ని బాషల నుంచి పోటీ పడుతున్నారు.
ఇప్పటికే తెలుగు రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు భారీ ధర చెల్లించి కొనేశారు.మొదటి సినిమా కంటే రెట్టింపు డబ్బులు ఈ సీక్వెల్ కోసం పెట్టారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ్ రీమేక్ రైట్స్ కోసం కూడా అక్కడ బడా నిర్మాణ సంస్థల మధ్య పోటీ నడిచింది.ఫైనల్ గా డ్రీం వారియర్ బ్యానర్ సొంతం చేసుకుంది.
సూర్య, కార్తి ఫ్యామిలీ నుంచి ఈ డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ హౌస్ వచ్చింది.ప్రస్తుతం తమిళంలో సుల్తాన్ సినిమాని ఈ సంస్థ తెరకేక్కిస్తుంది.ఎక్కువగా అ ఇద్దరు హీరోలతో సినిమాలు తీసే డ్రీమ్ వారియర్ ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2 రీమేక్ రైట్స్ సొంతం చేసుకోవడం కోలీవుడ్ లో సంచలనంగా మారింది.పెద్ద నిర్మాణ సంస్థ ద్వారా కేజీఎఫ్ 2 తమిళ్ లో రిలీజ్ కాబోతూ ఉండటం ఇప్పుడు అక్కడ కూడా సినిమాకి మించి మైలేజ్ దొరుకుతుందనే మాట వినిపిస్తుంది.
ఇక హిందీ రైట్స్ కోసం కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.