బైక్'ని అంబులెన్స్ గా మార్చిన డీఆర్డీవో!

జై జవాన్ జై కిసాన్ ఈ నినాదాలను చాలా సార్లు విని ఉంటాం.మన జవాన్లు మన కోసం కష్టపడుతున్న కష్టం అంతా ఇంతా కాదు.

 Drdo Bike Ambulance, Drdo, Bike , Ambulance, Soldiers-TeluguStop.com

రాత్రి అనకా పగలుఅనకా నిద్రాహారాలు మానేసి కష్టపడుతూ మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

జవాన్లు ఎంతో మంది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మన దేశ ప్రజలను కాపాడటం కోసం నిరంతరం కష్టపడుతూ మన అందరికీ రక్షణ కవచంలా ఉన్నారు.

మన దేశ సరిహద్దుల్లో ఉండి మన శత్రువులతో పోరాడి అనేక మంది ప్రాణాలు విడిచారు.అలా మెరుగైన వైద్యం లేక అత్యవసర చికిత్స అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అనేకంగా ఉన్నాయి.

ఇటువంటి జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో డిఆర్డిఓ వారు సరికొత్త వాహనాన్ని ఏర్పాటు చేశారు.

Telugu Ambulance, Bike, Drdo, Soldiers-National News

జవాన్ల ప్రాణాలను కాపాడటానికి బైక్ అంబులెన్స్ ను రూపొందించింది డి ఆర్ డి ఓ.ఈ బైక్ అంబులెన్సులు ఢిల్లీలో ప్రారంభించారు.సి ఆర్పిఎఫ్, డి ఆర్ డి ఓ సంయుక్తంగా ఏర్పడి రక్షిత అనే పేరుతో అంబులెన్స్ ను తయారుచేసింది.

అటవీ ప్రాంతాల్లో గాయపడిన జవాన్ల కోసం ఈ అంబులెన్స్ ను ఉపయోగించనున్నారు.నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో ఇరుకైన దారిలో సులువుగా చేరుకునేలా రూపొందించారు.జవాన్ల కోసమే కాకుండా సామాన్య ప్రజల కోసం కూడా ఈ వాహనాన్ని తయారు చేయడం జరిగింది.అడవుల్లో వైద్యం అందక జవాన్లు మరణించారు.

ఇటువంటివి మళ్ళీ జరగకూడదనే ఆలోచనతో ఈ బైక్ అంబులెన్స్ ప్రారంభించారు.ఈ బైక్ అంబులెన్స్ కు రక్షిత అనే పేరు కూడా పెట్టారు డీఆర్డీవో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube