ద్రౌపదీ ముర్మూ రోజురోజుకీ పెరుగుతున్న మద్దతు..

రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు రోజురోజుకీ మద్దతు పెరుగుతున్నాయి.రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకే విజయావకాశాలున్నాయని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.

 Draupadi Murmu's Support Is Increasing Day By Day ,draupadi Murmu, Mamata Banerj-TeluguStop.com

ముర్మూను ఎన్‌డీఏ అభ్యర్థిగా నిలబెట్టే ముందు ప్రతిపక్షాలతో బీజేపీ చర్చలు జరిపితే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు.అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తే రాష్ట్రపతిగా ఉండడమే దేశానికి మంచిదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

మహారాష్ట్రలో నెలకొన్న తాజా పరిస్థితులను చూస్తే ద్రౌపదీ ముర్మూ గెలుపునకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మమత అన్నారు.ముర్మూ పేరును ప్రకటించే ముందు బీజేపీ తమ సలహాను అడిగితే.

ఆ విషయాన్ని పరిశీలించేవాళ్లమని ఆమె అన్నారు.అయితే, ప్రతిపక్షాల నిర్ణయం ప్రకారమే ప్రస్తుతం నడుచుకుంటామని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.18 పార్టీలు ఒకచోట కూర్చొని ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించి నామినేషన్ కూడా వేసిన తర్వాత ఇప్పుడు పునరాలోచన కుదరదని ఆమె తెలిపారు.బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హాను ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబెట్టిన విషయం తెలిసిందే.

Telugu Akali Dal, Bjp, Congress, Draupadi Murmu, Mamata Banerjee, Yashwant Sinha

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్మూకు మద్దతునిచ్చే పార్టీల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.ఇప్పటికే జేడీయూ, వైసీపీ మద్దతు ప్రకటించాయి.తాజాగా అకాలీదళ్‌ పార్టీ కూడా తమ మద్దతు ముర్మూకేనని తెలిపింది.ఈ మేరకు అకాలీదళ్‌ పార్టీ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ చండీగఢ్‌లో ప్రకటించారు.ముర్మూకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు.తాము కాంగ్రెస్‌తో కలిసి వెళ్లబోమన్నారు.

కాంగ్రెస్ సిక్కులపై అనేక దాడులకు పాల్పడిందన్నారు.అయితే రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్మూకే విజయావకాశాలన్నాయని.

ముందే మా సలహా అడిగితే పరిశీలించేవాళ్లమని.రాష్ట్రపతి అభ్యర్థి ముర్మూకు అకాలీదళ్ సుఖ్‌బీర్‌ సింగ్‌ వర్గం మద్దతు ఇచ్చారని మమతాబెనర్జీ అన్నారు.

అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తే రాష్ట్రపతిగా ఉండడమే దేశానికి మంచిదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube