డ్రామా జూనియర్స్ - ది నెక్స్ట్ సూపర్ స్టార్ తో మన ముందుకు వస్తుంది జీ తెలుగు

ప్రకృతిని పులకరింపజేసే చైత్ర మాస ఆగమనంలో, శ్రీ శార్వరి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి అందరిని ఆహ్వానిస్తూ ఉగాది శుభాకాంక్షలను తెలుపుతుంది మన జీ తెలుగు.

 Drama Juniors - Zee Telugu Is Coming To Us With The Next Superstar, Drama Junior-TeluguStop.com

ఉగాది అంటే కొత్త ఆశలకు ఆశయాలకు పెట్టింది పేరు.

ఎప్పుడూ కొత్తదనంతో మనందరిని ఆకట్టుకునే జీ తెలుగు ఈసారి మరో కొత్త షోతో అందరిని అలరించడానికి మన ముందుకు వస్తుంది.డ్రామా జూనియర్స్ – ఈ షో పేరు వినని వారు ఉండరనడంలో అతిశయోక్తి లేదు.

చిన్నారులు ఎంతో ముచ్చటగా వారి ప్రతిభను ప్రదర్శించే చోటు జీ తెలుగు వారి డ్రామా జూనియర్స్.మరి ఈసారి ఇదే డ్రామా జూనియర్స్ మునుపెన్నడు చూడని విధంగా కొత్త హంగులతో డ్రామా జూనియర్స్ – ది నెక్స్ట్ సూపర్ స్టార్ గా ఏప్రిల్ 11 వ తేదీ రాత్రి 8 గంటలకు మొదలవబోతుంది.

ఇంతటి షోకి న్యాయనిర్ణేతలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మొట్ట మొదటిసారిగా తెలుగు టెలివిజన్ లోని షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.తెలుగు సినీ పరిశ్రమలో రేణు దేశాయ్‌ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఒకప్పుడు నటిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రేణూ దేశాయ్ ఇప్పుడు ఈ షో కి మరో జడ్జి గా పగ్గాలు అందుకున్నారు.వీళ్ళతో పాటు….క్వీన్ అఫ్ మెలోడీ అని పేరు తెచ్చుకున్న మన సింగర్ సునీత గారు కూడా ఈ షో కి జడ్జిగా వ్యవహరించనున్నారు.మరి జడ్జెస్ ఇలా ఉంటే యాంకర్ ఎలా ఉండాలి? అదిరిపోవాలి కదా….అందుకే మన అందరికి ఎంతో ఇష్టమైన ప్రదీప్ మాచిరాజు ఈ షో కి యాంకరింగ్ చేస్తున్నాడు.

మొట్ట మొదటి సారిగా షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ” డ్రామా జూనియర్స్ ఎప్పుడూ సరికొత్త టాలెంట్ ను బయటకు తీసుకొస్తుంది.ఈ షోలో భాగం అయినందుకు నాకు చాల ఆనందంగా ఉంది.నేను మంచి పర్ఫార్మెన్స్ లతో పాటు ఎంతో గొప్ప నటుల కోసం ఎదురుచూస్తున్నాను.”డోంట్ మిస్ ది గ్రాండ్ ప్రీమియర్ ఆఫ్ డ్రామా జూనియర్స్ – ది నెక్స్ట్ సూపర్ స్టార్ ఏప్రిల్ 11 రాత్రి 8 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి లలో.ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.

మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube