వామ్మో... నిజంగానే డ్రాగన్లు బ్రతికే ఉన్నాయట...!

మనం ఎప్పుడు టీవీ లో చైనా నా దేశం సంబంధించి డ్రాగన్ లను మాత్రమే చూస్తూ ఉండేవాళ్ళం.చైనా దేశం పురాణాల్లో, అలాగే పిల్లల పుస్తకాల్లో మాత్రమే కనిపించే ఈ డ్రాగన్ జీవులు ప్రస్తుతం నిజంగానే బతికి ఉన్నాయని తెలుస్తోంది.

 Dragons Are Alive, Aquarium, China, Salamander Dragon, Dragons Alive-TeluguStop.com

ఇకపోతే చైనా పురాణాల్లో దేశంలోని ప్రజలను ఎప్పటికప్పుడు రక్షిస్తూ, గాల్లో ఎగురుతూ, నోటిద్వారా నిప్పులు పుట్టించే డ్రాగన్స్ మాత్రం కాదు ఇవి.ఇది ఓ ప్రాంతానికి చెందిన సాలమండర్లు.అయితే ఇవి అచ్చం చైనా దేశంలో ఇంతవరకు చెప్పుకునే డ్రాగన్ల జాతికి చెందినవి.అచ్చం వాటిలాగే ఉంటాయి ఇవి కూడా.

అయితే ఇప్పుడు ఇవి స్లోవేనియా దేశంలో ఒక్కో గుహలో ఉన్నట్లు గుర్తించారు.2016 సంవత్సరంలో ఓ సాలమండర్ ఏకంగా ఎక్వేరియంలో 64 గుడ్లు పెట్టింది అందులో కేవలం 22 మాత్రమే పిల్లలగా అభివృద్ధి చెందాయి.అయితే ఆ 22 పిల్లలను నాలుగేళ్లుగా ఓ గుహలో నీటిలో ఉంచి పెంచుతున్నారు.అందుకు సంబంధించి కొందరు సిబ్బంది కూడా పని చేస్తున్నారు.అయితే ఇప్పుడు వాటిని చూసేందుకు పర్యాటకుల కొరకు తెరుస్తున్నారు.అయితే కేవలం రోజు అంతా కలిసి 30 మందిని మాత్రమే అందులోకి అనుమతిస్తారు.

వీటిని చూసేందుకు అనేక మంది పర్యాటకులు ఉత్సాహం చూపిస్తున్నారు.

అయితే ఇక్కడ కేవలం ఓ అక్వేరియంలో మూడు పిల్లల్ని మాత్రమే పర్యాటకుల కోసం చూసేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ జీవులు వంద సంవత్సరాల వరకు కేవలం నీటిలోనే నివసిస్తాయి.కొన్ని సంవత్సరాల కాలం నుండి డ్రాగన్ లను పెంచుతున్న ఆ గుహకు బయోడైవర్సిటీ పరంగా మంచి పేరు ఉంది.

ఇక్కడ అనేక రకాల జీవులు కూడా పుట్టుకొస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube