అమెరికా మార్కెట్ లోకి డాక్టర్ రెడ్డీస్ బీపీ ఔషదం..!!  

  • అమెరికాలో భారతీయ ఔషద దిగ్గజ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ దూకుడు పెంచింది. తన ఔషదాలు అమెరికా మరెక్ట్ లోకి విడుదల చేసిందికొన్ని రోజుల క్రితమే అమెరికా కోర్టు నుంచీ పలు ఔషధాల కి సంభందించి అనుమతులు తీసుకున్న డాక్టర్ రెడ్డీస్ ఇప్పుడు అమెరికాలో తమ కంపెనీ నుంచీ బీపీ ఔషధాన్ని విడుదల చేసింది.

  • Dr Reddy's Launches Blood Pressure Drug In US-Dr Reddy\'s Laboratories Us Market

    Dr Reddy's Launches Blood Pressure Drug In US

  • “క్లోర్తాలిడన్‌” పేరుతో విడుదల చేసిన ఈ ఔషధం బీపీ ని కంట్రోల్ చేసే చికిత్సలో ఉపయోగపడతాయని డాక్టర్ రెడ్డీస్ “బీఎస్‌ఈ” కి తెలిపింది…అయితే వేరొక కంపెనీ ఇప్పటికే “హిగ్రోటన్‌ బ్రాండ్‌” పేరుతో అమెరికా మార్కెట్‌లో అమ్మకాలు చేస్తోంది…ఇదిలాఉంటే

  • సెప్టెంబరుతో ముగిసిన 12 నెలల కాలంలో హిగ్రోటన్‌ బ్రాండ్‌ టాబ్లెట్ల అమ్మకాలు 12.2 కోట్ల డాలర్ల వరకు ఉన్నాయి. అయితే ఈ బ్రాండెడ్‌ టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా క్లోర్తాలిడన్‌ పేరుతో జనరిక్‌ వెర్షన్‌లో 25 ఎంజీ50 ఎంజీ మోతాదులో ఈ టాబ్లెట్లను విడుదల చేసినట్టుగా డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ ప్రకటించింది.