సంక్రాంతి రేస్ లో దూసుకొస్తున్న మరొక సీనియర్ హీరో!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ వాయిదా తో ఈసారి సంక్రాంతి సీజన్ వెలవెల బోతుంది.మొన్నటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా వస్తుంది అని సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలను లేకుండా చూసుకున్నారు టాలీవుడ్ హీరోలు.

 Dr Rajasekhar's Shekar Joins Sankranthi Race, Rajasekhar,sankranthi,shekar,sheka-TeluguStop.com

అయితే పెరుగుతున్న ఓమిక్రాన్ నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

దేశం మొత్తం ఓమిక్రాన్ కారణంగా కఠిన ఆంక్షలు విధించారు.

కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర తో సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కూడా విధించిన నేపథ్యంలో ఈ సినిమా వాయిదా వేయక తప్పలేదు.థియేటర్స్ లో కూడా 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండడంతో ఈ పాన్ ఇండియా సినిమాకు వర్క్ అవుట్ అవ్వదు అని నిర్ణయించుకుని వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Telugu Drrajasekhars, Rajasekhar, Sankranthi, Shekar, Tollywood-Movie

ఆర్ ఆర్ ఆర్ సినిమా వాయిదా చిన్న సినిమాలకు వరంగా మారింది.ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుండి వరుసగా చిన్న సినిమాలు విడుదల తేదీలు ప్రకటిస్తూ సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవాలి అని ప్రయత్నిస్తున్నారు.ఇప్పటికే దాదాపు 7 సినిమాలు సంక్రాంతి రేస్ లోకి రావడానికి సిద్ధం అయ్యి విడుదల కూడా కన్ఫర్మ్ చేసేశాయి.

Telugu Drrajasekhars, Rajasekhar, Sankranthi, Shekar, Tollywood-Movie

ఇక ఇప్పుడు ఈ లిస్టులో మరొక సీనియర్ హీరో కూడా చేరబోతున్నట్టు సమాచారం.యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కొత్త సినిమా ‘శేఖర్‘ కూడా పొంగల్ రేస్ లో ఉండబోతున్నారని ప్రచారం జరుగుతుంది.ఈ సినిమా జనవరి 14న విడుదల అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇప్పటికే బంగార్రాజు, డీజే టిల్లు, అతిధి దేవోభవ, రౌడీ బాయ్స్, 7డేస్ 6నైట్స్, హీరో సినిమాలు లైన్లో ఉండగా ఇప్పుడు ఈ సినిమా కూడా రాబోతుంది అన్న నేపథ్యంలో సంక్రాంతి రేస్ కాస్త ఉపందుకుందనే చెప్పాలి.మరి ఈసారి చిన్న సినిమాల హవా నేపథ్యంలో సంక్రాంతి విజేతగా ఏ హీరో నిలుస్తాడో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube