సుశాంత్ మృతి గురించి సంచలన వీడియో పోస్ట్ చేసిన డాక్టర్… సోషల్ మీడియాలో వైరల్  

Dr Minakshi mishra posted video on sushant death, Reha, Patna Police, Mumbai Police, Bollywood - Telugu Bollywood, Dr Minakshi Mishra Posted Video On Sushant Death, Mumbai Police, Patna Police, Reha

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఒక్కొక్కరు ఒక్కో వాదన వినిపిస్తున్నారు.ఇప్పటికే దీనిని ముంబై పోలీసులు ఆత్మహత్య అని తేల్చేసిన ఎక్కువ మంది విశ్వసించడం లేదు.

TeluguStop.com - Dr Minakshi Mishra Posted Video On Sushant Death

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అతను ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని సుశాంత్ తండ్రి కూడా చెబుతున్నారు.ఇక ఆత్మహత్య చేసుకోవడానికి రెండు రోజుల ముందు తనతో బాగానే మాట్లాడాడని సుశాంత్ సోదరి కూడా చెబుతుంది.

TeluguStop.com - సుశాంత్ మృతి గురించి సంచలన వీడియో పోస్ట్ చేసిన డాక్టర్… సోషల్ మీడియాలో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image

వారి మాటల బట్టి అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకునే విధంగా ఎవరైనా ప్రేరేపించారా లేక అతనిని హత్య చేసి ఆత్మహత్య క్రింద క్రియేట్ చేశారా అనే అనుమానాలు చాలా మంది వినిపిస్తున్నారు.ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై అందరూ వేళ్ళు చూపిస్తున్నారు.

ఇక సుశాంత్ తండ్రి కూడా ఆమె మీదనే ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే సుశాంత్ మృతికి సంబంధించి ఒక షాకింగ్ వీడియో బయటకి వచ్చింది.

ఈ వీడియో అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.ప్రముఖ డెర్మటాలజిస్ట్ మీనాక్షి మిశ్రా సుశాంత్ మరణానికి కారణం ఆత్మహత్య కాదు హత్య అని చెబుతున్న ఒక వీడియోను షేర్ చేశారు.

దీనిపై తన వాదనలకు మద్దతుగా ఈ వీడియోలో వివరించారు.ముఖ్యంగా సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి వివరించారు.అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అనే విషయాల గురించి కూడా ఇందులో ప్రస్తావించారు.దీంతో సుశాంత్ ఆత్మహత్యపై ఇప్పటికే వ్యక్తమవుతున్నఅనుమానాలకు తాజా వీడియో ద్వారా మరింత బలం చేకూరుతోందన్న వాదన వినిపిస్తోంది.

ఇక ఈ డాక్టర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పోలీసులు కూడా ఆమె పోస్ట్ చేసిన వీడియోని పరిశీలించి ఆ కోణంలో కూడా విచారణ చేయాలని భావిస్తున్నారు.

#Patna Police #DrMinakshi #Reha #Mumbai Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Dr Minakshi Mishra Posted Video On Sushant Death Related Telugu News,Photos/Pics,Images..