ట్రంప్ ఆశలు గల్లంతే..బాంబు పేల్చిన పౌసీ..!!

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టబోతున్నారు అనే విషయం మరో కొన్ని రోజుల్లో తేలనుంది.కేవలం 3 రోజుల వ్యవధిలో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.

 Dr. Fausi Spoil The Trump Hopes Trump, Dr. Fausi, Coronavirus, America President-TeluguStop.com

అధికారాన్ని వదులుకోకూడదనే ఆలోచనతో ట్రంప్, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో బిడెన్ ఇద్దరూ భారీ వ్యుహలనే రచిస్తున్నారు.ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నా తుది విజయం ఎవరిని వరిస్తుందనేది మాత్రం సస్పన్స్ గానే ఉంది.

ఇదిలాఉంటే

కరోనా మహమ్మారి అమెరికాలో విజ్రుంభించడం ట్రంప్ ఓటమికి కారణమవుతుందని, అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసే శక్తి కేవలం కరోనా సోకినా తరువాత జరిగిన పరిణామాలపైనే ఆధారపడి ఉంటుందని అనుకున్న తరుణంలో ట్రంప్ వ్యూహాత్మకంగా కరోన వైరస్ కి వ్యాక్సిన్ తీసుకోవస్తున్నానని ప్రకటించారు.ఎన్నికల ముందే ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

తనపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రకు విరుగుడుగా ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని భావించారు.అందుకు తగ్గట్టుగానే శాస్త్రవేత్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.కానీ

Telugu America, Coronavirus, Democratic, Dr Fausi, Drfausi, Republican, Trump-Te

ట్రంప్ ఆశలను గల్లంతు చేస్తూ కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో వచ్చే అవకాశాలు లేవని నవంబర్ 3 లోగా కష్టమేనని అమెరికా ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణుడు కరోనా వైరస్ నివారణ చర్యల అధికారి పౌసీ బాంబు పేల్చారు.కరోనా కి వ్యాక్సిన్ కనుగునే క్రమంలో అందరం ఎంతో శ్రమిస్తున్నామని, నవంబర్ మొదటి వారంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు లేవని కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ జనవరిలో కానీ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.ఇప్పటికి ఈ వ్యాక్సిన్ మానవ ప్రయోగ దశలో ఉందని రెండు కంపెనీలు ఈ ప్రయోగాలపై నివేదికలు ఇవ్వాల్సి ఉందని అయితే ఎన్నికల తరువాతనే ఈ రిజల్స్ వస్తాయని పౌసీ తెలిపారు.

అయితే వ్యాక్సిన్ వస్తే ఎన్నికల్లో తనకు విజయం ఖాయమని భావించిన ట్రంప్ ఆశలపై పౌసీ చేసిన వ్యాఖ్యలు నీళ్ళు చల్లాయని,ట్రంప్ ఓటమికి ప్రధాన కారణం కరోన మహమ్మారి ప్రభావమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube