భారతీయుడుకి అరుదైన గౌరవం..!!!  

అమెరికాలో ఎంతో మంది భారతీయులు స్థిరపడి అక్కడ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. విద్యా , ఉద్యోగ , వైద్య రంగాలలో భారతీయుల హవా మాములుగా ఉండదు. తాజాగా వైద్య రంగంలో అత్యంత కీలకమైన సర్జన్ విభాగంలో టాప్ మోస్ట్ వైద్యులుగా ఉన్న భారతీయుడికి అక్కడ వీ అండ్ వీ అనే గ్రూప్ అమెరికాలో టాప్ సర్జన్ గా గుర్తించి సత్కరించింది.

Dr Daluvoy Get Awarded As Top Surgeon In America-Nri Telugu Nri News Updates

Dr Daluvoy Get Awarded As Top Surgeon In America

బెవెర్లీ హిల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రక్తనాళ వైద్యులైన డా.అరుణ్ దాలువోయ్‌కు “టాప్ సర్జన్‌” గా గుర్తింపు ఇస్తూ సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు విదేశాల నుంచి కూడా అనేక మంది అతిథులు పాల్గొన్నారు. డా.అరుణ్ తన సర్వీసులో దాదాపు 50 వేలకు పైగా సర్జరీలు చేసి రికార్డ్ సృష్టించారు

Dr Daluvoy Get Awarded As Top Surgeon In America-Nri Telugu Nri News Updates

భారత్ లో మెడికల్ లో గ్రాడ్యుయేషన్ చేసిన ఆయన పీజీ కోసం ఐర్లాండ్, అలాగే అమెరికా వెళ్ళారు.ప్రస్తుతం ఆయన లాస్ ఏంజెలెస్‌లోని సెయింట్ మేరీ మెడికల్ సెంటర్ లో వైద్యులుగా సేవలు అందిస్తున్నారు. ఈ ఘటన సాధించినందుకు గాను పలువురు ఎన్నారైలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.