ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు అత్యధికంగా ఎదుర్కునే సమస్య రొమ్ము క్యాన్సర్.ఈ వ్యాధి పేరు చెప్తేనే మహిళలు ఎంతో ఆందోళన చెందుతారు.
దశాబ్దాల కాలంగా ఈ వ్యాధి నిర్మూలనకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నా ఫలితాలు మాత్రం శూన్యమనే చెప్పాలి.ప్రతీ ఏటా వేలాది మంది మహిళలు కేవలం రొమ్ము క్యాన్సర్ కారణంగా చనిపోవడం ఎంతో బాధాకరమైన విషయం ఇప్పటి వరకూ పరిశోధనలు జరిగినా అవి ఫలితాలను ఇవ్వలేకపోయాయి.
అయితే రొమ్ము క్యాన్సర్ నివారణపై ఏళ్ళ తరబడి పరిశోధనలు చేస్తున్న మన భారతీయ ప్రవాస మహిళ ఈ ప్రయత్నంలో విజయం సాధించారనే చెప్పాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ వార్త చెప్పలేని సంతోషాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతానికి ప్రయోగదశలో ఉన్న ఈ వ్యాక్సిన్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది.జంతువులపై ప్రయోగించిన ఈ వ్యాక్సిన్ బిగ్ సక్సెస్ అవడంతో మనుషులపై ప్రయోగాలు చేస్తున్నారు.
ఈ వ్యాక్సిన్ ను కనిపెట్టింది ఎవరో కాదు అజ్మీర్ కు చెందిన భారత సంతతి మహిళ డాక్టర్ చవీ జైన్.ఇంతకీ ఎవరీ చవీ జైన్.

డాక్టర్ చవీ జైన్ తల్లి తండ్రులు అజ్మీర్ కు చెందినవారే, చవీ అజ్మీర్ లో తన స్కూల్ విద్యను పూర్తి చేసి పూణేలో M tec పూర్తి చేశారు.ఆ తరువాత ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్విట్జర్లాండ్ లో phd చేశారు.ఆ తరువాత ఉద్యోగ రీత్యా అమెరికాలో స్థిరపడిన చవీ అక్కడ లెర్నర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లీవ్ ల్యాండ్ క్లినిక్ లో పనిచేస్తున్నారు.ఈ సమయంలోనే ఆమె మహిళల రొమ్ము క్యాన్సర్ నివారణపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేశారు.
అలాగే అమెరికన్ క్యాన్సర్ రిసర్చ్ సొసైటీ కి బ్యాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లీనికల్ ట్రైల్స్ లో ఉందని ఈ టీకా వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్ లపై పరిశోధనలు చేస్తున్నారని తెలుస్తోంది.